రయ్‌ రయ్‌ చీపురు

ABN , First Publish Date - 2020-11-23T02:04:59+05:30 IST

హారీపాటర్‌ సినిమాలు చూసిన వాళ్లెవరైనా సరే ఓసారి చీపురు పట్టుకుని గాల్లో ఎగరిపోవాలని కలలుకంటారు. అలాగే కలలు కని నిజం చేశారు బ్రెజిల్‌కు చెందిన ఇద్దరు మిత్రులు. వినిసియస్‌ సాన్‌క్టస్‌, అలెగ్జాండ్రో రస్సో లకు హారీపాటర్‌ సినిమాలంటే...

రయ్‌ రయ్‌ చీపురు

హారీపాటర్‌ సినిమాలు చూసిన వాళ్లెవరైనా సరే ఓసారి చీపురు పట్టుకుని గాల్లో ఎగరిపోవాలని కలలుకంటారు. అలాగే కలలు కని నిజం చేశారు బ్రెజిల్‌కు చెందిన ఇద్దరు మిత్రులు. వినిసియస్‌ సాన్‌క్టస్‌, అలెగ్జాండ్రో రస్సో లకు హారీపాటర్‌ సినిమాలంటే భలే ఇష్టం. అందులో మేజిక్‌ చీపురుతో ఎరిగిపోయే హారీపాటర్‌, అతడి మిత్ర బృందాన్ని రెప్ప వేయకుండా చూసేవాళ్లు. తాము కూడా అలాంటిదాన్ని తయారు చేయాలని పూనుకున్నారు.


అచ్చంగా సినిమాలో ఉన్న చీపురు మాదిరిగా ఓ పరికరాన్ని డిజైన్‌ చేశారు. దాని పేరు ‘నువెమ్‌’. 51 సెంటీమీటర్ల పొడవుతో ఉన్న నువెమ్‌ను కార్బన్‌ స్టీల్‌తో రూపొందించి ఎలకో్ట్రస్టాటిక్‌ పెయింటింగ్‌ వేశారు. మధ్యలో కూర్చునేలా ఓ సీటును కూడా అమర్చారు. దాన్ని ఎలక్ట్రిక్‌ యూనిసైకిళ్లకు బిగించారు. నువెమ్‌ను పైకి అంటే ముందుకు సాగుతుంది. కిందకి అంటే బ్రేక్‌ పడుతుంది. సావో పౌలో నగరంలో మిత్రులిద్దరూ ఈ కొత్త యూనిసైకిళ్లను ప్రదర్శించారు. చూపరులను భలేగా ఆకర్షించాయి. ఈ యూనిసైకిళ్లు అమ్మడానికీ సిద్ధంగా ఉన్నాయట.

Updated Date - 2020-11-23T02:04:59+05:30 IST