‘పోలవరం’ విచారణ నుంచి వైదొలగిన జస్టిస్‌ లావు నాగేశ్వరరావు

ABN , First Publish Date - 2021-04-09T06:23:40+05:30 IST

పోలవరం ప్రాజెక్టు ముంపుపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపే ధర్మాసనం నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు వైదొలిగారు

‘పోలవరం’ విచారణ నుంచి వైదొలగిన జస్టిస్‌ లావు నాగేశ్వరరావు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ముంపుపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపే ధర్మాసనం నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు వైదొలిగారు. గురువారం ఈ పిటిషన్‌ ఆయన, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే.. గతంలో న్యాయవాదిగా తాను పోలవరం కేసును వాదించినందున.. వేరే ధర్మాసనం ముందు ఈ నెల 29న ఈ పిటిషన్‌ను ఉంచాలని జస్టిస్‌ నాగేశ్వరరావు రిజిస్ట్రీకి సూచించారు. ఎగువ రాష్ట్రాల్లో పోలవరం ముంపుపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున.. బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా అక్కడకు బదిలీ చేయాలని ఒడిశా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

Updated Date - 2021-04-09T06:23:40+05:30 IST