Advertisement
Advertisement
Abn logo
Advertisement

జ్యోతిరావుపూలే ఆశయాలు సాధించాలి

 రైల్వేబోర్డు సభ్యుడు కొణతం నాగార్జునరెడ్డి 

జిల్లావ్యాప్తంగా జ్యోతిరావుపూలే వర్ధంతి 

పూలే చిత్రపటాలకు నివాళులర్పించిన వివిధ సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు

మోత్కూరు, నవంబరు 28: మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు సాధించాలని రైల్వేబోర్డు సభ్యుడు కొణతం నాగార్జునరెడ్డి అన్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆదివారం మోత్కూరులో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన సేవలు మరవలేనివన్నారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పోచం సోమయ్య, బీజేపీ జిల్లా నాయకుడు గౌరు శ్రీనివాస్‌, మునిసిపాలిటీ అధ్యక్షుడు బయ్యని రాజు, సజ్జనం మనోహర్‌, ముత్తినేని తిరుమలేష్‌, మరాటి అంజయ్య, ఎల్లంకి సంజీవరెడ్డి, సకినాల సోమయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. బీఆర్‌ఎ్‌సఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మోత్కూరులో మహాత్మాజ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నిలిగొండ మత్స్యగిరి, బోళ్ల హన్మంతు, మొరిగాల వెంకన్న పాల్గొన్నారు. బీఎస్పీ ఆధ్వర్యంలో పూలే విగ్రహానికి బీఎస్పీ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కె.బి.రాజు, కొంపెల్లి రాజు, బుర్ర మహేష్‌, ప్రతాప్‌ పాల్గొన్నారు.

అడ్డగుడూరులో.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం కృషి చేసిన మహనీయుడు పూలే అని బీసీ రిజర్వేషన్‌ సాధన సమితి వ్యవస్థాపకుడు బుర్ర శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. పూలే వర్ధంతి సందర్భంగా మండలకేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  

చౌటుప్పల్‌ టౌన్‌: బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావుపూలే అని బీఎస్పీ మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జి పల్లె లింగస్వామి అన్నారు. చౌటుప్పల్‌ పట్టణంలో ఆదివారం జ్యోతిరావు పూలే 131వ వర్ధంతిని బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో మస్క్‌ నర్సింహ, కత్తుల పద్మ, పరమేష్‌,  సుభాష్‌ చంద్రబోస్‌, దోనూరు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ఆలేరులో.. పూలే వర్ధంతిని ఆదివారం ఆలేరులో బీజేపీ నాయకులు నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో పూలే, సావిత్రి దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బడుగు జహంగీర్‌, నాయకులు పులిపలుపుల మహేశ్‌, కటకం రాజు, హరికిషన్‌, నర్సింహారెడ్డి పాల్గొన్నారు. 

వలిగొండలో.. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు కృషి చేయాలని బీసీ సంఘం పట్టణ అధ్యక్షుడు నానచర్ల రమేష్‌ అన్నారు. మండలకేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పూలే 131వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో వెంకటేశం, బాలరాజు  పాల్గొన్నారు. 

జ్యోతిరావు పూలేకు ఘననివాళి

భువనగిరి టౌన్‌: జ్యోతిరావుపూలే వర్ధంతిని పురస్కరించుకొని భువనగిరలో ఆదివారం ఆయన విగ్రహం వద్ద వివిధ సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సామాజిక ఉద్యమాలకు పూలే పితామహుడని కొనియాడారు. వేర్వేరుగా నిర్వహించిన వర్ధంతి కార్యక్రమాల్లో మునిసిపల్‌ కౌన్సిలర్లు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, ఎండీ నజీమా సల్లాఉద్దీన్‌, మాయ దశరథ, జనగాం కవిత, పీసీసీ మాజీ కార్యదర్శి తంగెళ్లపల్లి రవికుమార్‌, బీసుకుంట్ల సత్యనారాయణ, జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రావుల రాజు, బీఎస్పీ రాష్ట్ర నాయకులు భట్టు రాంచంద్రయ్య, నర్సింహ స్వామి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. 

మోటకొండూర్‌లో.. మహాత్మాజ్యోతిరావు పూలే ఆశయ సాధనకు కృషి చేయాలని బీజేపీ బీసీ మోర్చా మండల అధ్యక్షుడు ఎగ్గిడి వెంకటయ్య అన్నారు. పూలే వర్ధంతి సందర్భంగా ఆదివారం మండలకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు జోరుక ఎల్లేశ్‌, జిల్లా కార్యదర్శి పీసరి తిరుమలరెడ్డి, రవీందర్‌, కృష్ణ, అనంతుల పాండు రంగారెడ్డి, రేగు మల్లేశ్‌ పాల్గొన్నారు.  

Advertisement
Advertisement