Advertisement
Advertisement
Abn logo
Advertisement

కడప సెంట్రల్ జైల్లో డిప్యూటీ జైలర్ ఆత్మహత్యాయత్నం

కడప: జిల్లాలోని సెంట్రల్ జైల్లో మహళా విభాగం డిప్యూటీ జైలర్ హిమాంబి ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. హిమాంబి చెయ్యి కోసుకొని బలవన్మరణానికి యత్నించింది. నాలుగుపేజీల సూసైడ్ నోట్ కూడా రాయగా..  సిబ్బంది సూసైడ్ నోట్‌ను కనిపించకుండా చేసింది. అంబులెన్స్‌లో గుట్టు చప్పుడు కాకుండా కడప నగరంలోని  ఓ ప్రైవేటు ఆసుపత్రికి హిమాంబిని జైలు అధికారులు తరలించారు. పై అధికారుల వేధింపులే హిమాంబి ఆత్మహత్యకు కారణమని సమాచారం. మరో డిప్యూటీ జైలర్‌కు హిమాంబికి మధ్య గత కొంత కాలంగా మనస్పర్ధలతో విభేధాలు తలెత్తినట్లు తెలుస్తోంది. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement