టీఆర్‌ఎస్‌ పార్టీకి, ఏఎంసీ చైర్మన్‌ పదవికి రాజీనామా కడార్ల గంగనర్సయ్య

ABN , First Publish Date - 2021-08-03T06:16:10+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీకి, ఏఎంసీ చైర్మన్‌ పదవికి రా జీనామా చేస్తున్నట్టు నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ వ్యవసాయ మార్కెట్‌ క మిటీ చైర్మన్‌ కడార్ల గంగనర్సయ్య ప్రకటించారు.

టీఆర్‌ఎస్‌ పార్టీకి, ఏఎంసీ చైర్మన్‌ పదవికి రాజీనామా కడార్ల గంగనర్సయ్య
రాజీనామా లేఖను చూపుతున్న గంగనర్సయ్య

ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ వేధింపులు భరించలేకే పార్టీని వీడుతున్నా.. 

ఇంట్లోంచి ఎమ్మెల్యే దంపతుల ఫొటో తొలగింపు 

రేఖానాయక్‌ నియంతలాగా వ్యవహరిస్తున్నారని మండిపాటు  

ఉద్యమకారులకు సరైన గౌరవం లేదని కంటతడి

ఖానాపూర్‌, ఆగస్టు 2 : టీఆర్‌ఎస్‌ పార్టీకి, ఏఎంసీ చైర్మన్‌ పదవికి రా జీనామా చేస్తున్నట్టు నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ వ్యవసాయ మార్కెట్‌ క మిటీ చైర్మన్‌ కడార్ల గంగనర్సయ్య ప్రకటించారు. సోమవారం ఖానాపూర్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ కేవలం డబ్బు కోస మే పని చేస్తూ ప్రజల్లో పార్టీ పరువును తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వద్దని చెబితే నియంతలా వ్యవహరిస్తూ.. తనను ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందు వల్లే పార్టీని వీడుతున్నట్టు స్పష్టం చేశారు. రాష్ట్రసాధన కోసం తాను ఉద్యమకాలంలో ఎంతో కృషి చేశానని, ఉద్యోగాన్ని కూడా లెక్కచేయ కుండా ఉద్యమంలో పాల్గొన్నానని తెలిపారు. తనకు ఏఎంసీ చైర్మన్‌ పదవి ఇచ్చిన  నాటి నుంచి ఎన్నోరకాలుగా అవమానించారని కంటతడి పెట్టారు. తనకు పదవి ఇచ్చే ముందు కూడా ఆర్థికంగా నష్టం చేశార న్నారు. ఉద్యమకారులకు సరైన గౌరవం ఇవ్వడం లేదన్నారు. పార్టీ అధి ష్టానం నిర్ణయాన్ని శిరోఽధార్యంగా భావించి స్థానికేతరులైనప్పటికీ ఖానాపూర్‌ ఎమ్మెల్యేగా అజ్మీరా రేఖానాయక్‌ను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలి పించుకున్నామని తెలిపారు. అనంతరం తనింట్లో ఉంచిన ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాంనాయక్‌ దంపతుల ఫొటోలను తొలగించారు. తన రాజీనామాను వ్యవసాయశాఖ, మార్కెటింగ్‌శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డికి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు పంపినట్టు గంగనర్సయ్య తెలిపారు. 

Updated Date - 2021-08-03T06:16:10+05:30 IST