కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపడుచులకు వరం

ABN , First Publish Date - 2021-06-18T06:50:46+05:30 IST

సీఎం కేసీఆర్‌ చేపట్టిన కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపడుచులకు వరం లాంటిదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.

కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపడుచులకు వరం
కేతేపల్లిలో కల్యాణలక్ష్మి చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే లింగయ్య

ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కేతేపల్లి / నార్కట్‌పల్లి / నకిరేకల్‌, జూన్‌ 17 :
సీఎం కేసీఆర్‌ చేపట్టిన కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపడుచులకు వరం లాంటిదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన 50మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను గురువారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బి.స్వర్ణలత, నకిరేకల్‌ మునిసిపల్‌ చైర్మన్‌ ఆర్‌.శ్రీనివాస్‌, తహసీల్దార్‌ డి.వెంకటేశ్వర్లు, ఎంపీడీవో డి.భవాని, వైస్‌ ఎంపీపీ మాధవి, సర్పంచలు బి.శ్రీనివాసయాదవ్‌, కట్టా శ్రవణ్‌, జె.వెంకటరెడ్డి, డి.వీరయ్య, బి.జానకిరాములు, ఎంపీటీసీ ఎర్రెబోయిన వెంకన్నయాదవ్‌, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ కె.సైదిరెడ్డి, డైరెక్టర్లు టి.వెంకన్నగౌడ్‌, డి.సునీత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వెంకటరెడ్డి, సీహెచ్‌.వెంకన్న, పలువురు నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా నార్కట్‌పల్లిలో 85మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తహసీల్దార్‌ పొడపంగి రాధ, ఆర్‌ఐ మంగ, టీఆర్‌ఎస్‌ మండల, పట్టణ శాఖల అధ్యక్షులు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, దోసపాటి విష్ణు తదితరులు పాల్గొన్నారు. నకిరేకల్‌ పట్టణంలోని మార్కెండేయ స్వామి ఆలయ  కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి ఎమ్మెల్యే చిరుమర్తి శంకుస్థాపన చేసి మాట్లాడారు. పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు యలగందుల కృష్ణమూర్తి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన రాచకొండ శ్రీనివాస్‌, మార్కెట్‌ చైర్మన ఉమారాణి, పీఏసీఎస్‌ చైర్మన మహేందర్‌రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T06:50:46+05:30 IST