కమనీయం శివపార్వతుల కల్యాణం

ABN , First Publish Date - 2022-03-03T06:13:54+05:30 IST

శివనామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగాయి. ‘శంభో శంకర..హరహర మహ దేవ’ అంటూ భక్తులు తన్మయ త్వం చెందారు. మహా శివరాత్రి అర్థరాత్రి స్వామివారికి లింగోద్భవం, రుద్రాభి షేకం, బిల్వార్ఛనలు, జలాభిషేకం నిర్వహించారు.

కమనీయం శివపార్వతుల కల్యాణం
తాడురులో శివపార్వతుల కళ్యాణం

సిరిసిల్ల, మార్చి3 (ఆంధ్ర జ్యోతి) :శివనామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగాయి. ‘శంభో శంకర..హరహర మహ దేవ’ అంటూ భక్తులు తన్మయ త్వం చెందారు. మహా శివరాత్రి అర్థరాత్రి స్వామివారికి లింగోద్భవం, రుద్రాభి షేకం, బిల్వార్ఛనలు, జలాభిషేకం నిర్వహించారు. రోజం తా ఉపవాసం ఉన్న భక్తులు  జాగరణ పాటించారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో నిర్వహించిన శివపార్వతుల కల్యాణం కన్నుల పండువగా సాగింది.   సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాజరాజేశ్వరస్వామి దేవస్థానం,  శివభక్త మార్కండేయ స్వామి దేవస్థానం,  విశ్వనాథ స్వామి దేవాలయాల్లో శివ పార్వతుల కల్యాణం నిర్వ హించారు. మహా అన్నదాన ప్రసాదం వితరణ చేశారు. వేములవాడ  రాజరాజేశ్వర స్వామి దేవస్థానంతోపాటు మండలాల్లోని శివాలయాల్లో వైభవోపేతంగా స్వామి వారి కల్యాణం జరిపించారు. మూడు రోజులపాటు భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి వేడుకలు ముగిశాయి. 

 ఇల్లంతకుంట : మండలంలోని అనంతగిరిలో భక్తిప్రపత్తుల మధ్య రాజరాజేశ్వరస్వామి కల్యాణోత్సవం నిర్వ హంచారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కు లు చెల్లించుకున్నారు.వల్లంపట్లలో శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. సర్పంచ్‌ నర్సింహరెడ్డిస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మహిళలు ఒడి బి య్యం పోశారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచులు పల్లె నర్సింహరెడ్డి, కేతిరెడ్డి అనసూ య, ఎంపీటీసీ గొట్టెపర్తి పర్శరాం, నాయిని స్రవంతి, వేదబ్రాహ్మణులు చెరుకు పవన్‌శర్మ, విఠల్‌శర్మ, నాయకులు  ఆంజనేయులు,  బాలకిషన్‌, చొప్పరి శ్రీధర్‌ పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిపేట: వేములవాడ  రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయామైన ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లోని శివాలయంలో మంగళవారం రాత్రి శివపార్వతుల కల్యాణ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. స్వామి వారికి వేములవాడ రాజన్న ఆలయం తరుపున పట్టువస్త్రాలను సమర్పించారు. గ్రామ పురు వీధుల గుండా రథంపై శివపార్వతుల శోభాయాత్ర నిర్వహించారు. సర్పంచ్‌ లక్ష్మి, ఎంపీటీసీ అపెరాసుల్తానా, ఉప సర్పంచ్‌ మహేందర్‌, సింగిల్‌ విండో డైరెక్టర్‌   నర్సయ్య, ఆలయ కమిటీ చైర్మన్లు అంజాగౌడ్‌, నర్సయ్య, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

తంగళ్లపల్లి: తంగళ్లపల్లి మండలం తాడురు శివాలయంలో శివపార్వతుల కల్యాణోత్సవం వైభవంగా సాగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వ హించారు.   సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌రావు, జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పుర్మాణి లింగారెడ్డి, స్థానిక సర్పంచ్‌ సురభి సరిత నవీన్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

శివాలయాల వద్ద అన్నదానం

తంగళ్లపల్లి మండల కేంద్రంలో శివాలయం వద్ద నిర్వ హించిన అన్నదాన కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు చిక్కాల రామరావు, ఎంపీపీ పడిగెల మానస రాజు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గజభీంకర్‌ రాజన్న ప్రారంభించారు.ఇందిరమ్మకాలనీలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పుర్మాణి లింగారెడ్డి, స్థానిక సర్పంచ్‌ భైరి శ్రీవాణి రమేశ్‌, నాయకులు మంచికట్ల రమేశ్‌, బుర శ్రీనివాస్‌, ప్రశాంత్‌, అలువాల సాయి ప్రారంభించారు.  

 బోయినపల్లి : బోయినపల్లి మండలంలోని విలాసాగర్‌ గ్రామంలో శ్రీ త్రిలింగ సంగమేశ్వర స్వామి ఆలయంతో పాటు వెంకట్రావుపల్లె గ్రామంలోని ఆలయంలో శివ కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ శివకళ్యాణానికి భక్తు లు తిలకించి స్వామివారిని దర్శించుకున్నారు. వెంక ట్రావుపల్లెలో జరిగిన శివకళ్యాణంలో జడ్పీటీసీ కత్తెరపాక ఉమ కొండయ్య, తహసీల్దార్‌ స్వాతి, సర్పంచ్‌ బూరుగుల నందయ్య, నాయకులు బాలరాజు, లక్ష్మీనారాయణ, హన్మంతు, వేణు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

ఎన్గల్‌లో ప్రత్యేక పూజలు

చందుర్తి : చందుర్తి మండలం ఎన్గల్‌లోని రాజ రాజేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయంలో లింగా ర్చనలో పిండితో రూపొందించిన దీపాలను తయారు చేసి వెలిగించారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. వేములవాడ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఏనుగు మనోహర్‌రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు.  సర్పంచ్‌ లింగంపల్లి సత్తయ్య, వార్డుసభ్యులు ఉన్నారు.

Updated Date - 2022-03-03T06:13:54+05:30 IST