కరోనా టీకా వికటించి శిశువు మృతి...ఏఎన్‌ఎంపై బంధువుల దాడి

ABN , First Publish Date - 2021-11-11T16:55:10+05:30 IST

జిల్లాలోని సదాశివనగర్ మండలం పద్మాజివాడి చౌరస్తాలో కరోన టీకా వికటించి శిశువు మృతి చెందిందంటూ ఏఎన్ఎంపై బంధువుల దాడికి తెగబడ్డారు.

కరోనా టీకా వికటించి శిశువు మృతి...ఏఎన్‌ఎంపై బంధువుల దాడి

కామారెడ్డి: జిల్లాలోని సదాశివనగర్ మండలం పద్మాజివాడి చౌరస్తాలో కరోన టీకా వికటించి శిశువు మృతి చెందిందంటూ ఏఎన్ఎంపై బంధువుల దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఏఎన్‌ఎం సావిత్రి తలకు, కంటిపై గాయాలయ్యాయి. గాంధారి మండలం రాంపూర్ గడ్డకు చెందిన శ్రీలత గాంధారి ప్రభుత్వ హాస్పిటల్‌లో ఈ నెల 2న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు అనారోగ్యంగా ఉండటంతో హైదరాబాద్ తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఇటీవల ఏఎన్ఎం సావిత్రి వేసిన కరోనా టీకా వికటించడం వల్లనే తమ శిశువు మృతి చెందిందని బంధువులు దాడికి పాల్పడ్డారు. 

Updated Date - 2021-11-11T16:55:10+05:30 IST