సెప్టెంబర్ 8న దుర్గా, బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్ల ప్రారంభం

ABN , First Publish Date - 2020-09-04T15:22:35+05:30 IST

రాష్ట్రంలో రోడ్ల పురోగతి, బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని రోడ్లు, భవనాలశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ ప్రధాన కార్యాలయంలో మంత్రి అధ్యక్షతన రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్

సెప్టెంబర్ 8న దుర్గా, బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్ల ప్రారంభం

మంత్రి శంకరనారాయణ వెల్లడి


విజయవాడ సిటీ(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో రోడ్ల పురోగతి, బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని రోడ్లు, భవనాలశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ ప్రధాన కార్యాలయంలో మంత్రి అధ్యక్షతన రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 29వ గవర్నింగ్‌ బాడీ సమావేశం గురువారం జరిగింది. మంత్రి మాట్లాడుతూ సీఎం సూచనలతో రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఏపీఆర్‌డీసీ సమావేశంలో సమీక్షించామన్నారు.


కనకదుర్గా ఫ్లై ఓవర్‌, బెంజిసర్కిల్‌  ఫ్లై ఓవర్‌తో పాటు రూ.15వేల కోట్లకు సంబంధించిన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఈనెల 8న కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ న్యూఢిల్లీ నుంచి వర్చ్యువల్‌ ద్వారా చేస్తారన్నారు. తొలుత వైజాగ్‌-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు సంబంధించి 352 కిలోమీటర్ల 13 రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. రాష్ట్ర ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, ఏపీఆర్‌డీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, స్టేట్‌ హైవేస్‌ (ఆర్‌అండ్‌బీ) చీఫ్‌ ఇంజనీర్‌ పీసీ రమేశ్‌కుమార్‌, ఎండీఆర్‌ బిల్డింగ్స్‌ (ఆర్‌అండ్‌బీ) చీఫ్‌ ఇంజనీర్‌ కె.నయిముల్లా పాల్గొన్నారు.

Updated Date - 2020-09-04T15:22:35+05:30 IST