Abn logo
Nov 28 2020 @ 00:43AM

సచివాలయ వ్యవస్థ పనితీరును పరిశీలించిన కర్ణాటక ఐఏఎస్‌ బృందం


చిలమత్తూరు, నవంబరు 27: రాష్ట్రంలో అమలవుతున్న గ్రామ సచివాలయ వ్యవస్థ పనితీరును కర్ణాటక రాష్ట్ర ఐఏఎస్‌ బృందం శుక్రవారం పరిశీలించింది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయి.. వాటి అమలులో సచివాలయ పాత్ర ఎంత? అనే విషయాలపై ఆరా తీశారు. బెంగళూరు నుంచి ప్రియాంక మేరీ (కర్ణాటక రాష్ట్ర పంచాయత్‌ రాజ్‌ కమిషనర్‌), నందిని (బళ్లారి జిల్లా పరిషత్‌ సీఈఓ), డాక్టర్‌ ఎల్లాకీ గౌడ్‌ (కర్ణాటక రాష్ట్ర పంచాయతీ రాజ్‌ రీజోర్స్‌ డైరెక్టర్‌), రవణప్ప (కర్ణాటక రాష్ట్ర పంచాయతీ డైరెక్టర్‌), డాక్టర్‌ రమేష్‌ (పంచాయతీ రాజ్‌ ఫ్యాకెల్టీ) వచ్చి రికార్డులను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రంలో సచివాలయ ఉద్యోగులు, గ్రామ వలంటర్లీతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటుచేసి పలు విషయాలను తెలుసుకున్నారు. కోడూరు తోపులో ఉన్న చెత్తతో సంపద కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం గ్రీన్‌ అంబాసిడర్లతో మాట్లాడారు. అనంతరం ఐఏఎస్‌ బృందం సభ్యులు మాట్లాడుతూ ఏపీలో అమలవుతున్న సచివాలయ వ్యవస్థను పరిశీలించడానికి వచ్చామని, ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంత మేర మేలు జరుగుతోందో గుర్తించి కర్ణాటక ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.  కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అఽధికారిణి పార్వతమ్మ, పెనుకొండ డీఎల్‌పీఓ విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీడీఓ సుధామణి, ఈఓఆర్డీ శకుంతల, పంచాయతీ కార్యదర్శి కెంచరాయప్ప తదితరలు పాల్గొన్నారు. 

సోమందేపల్లి(పెనుకొండ): ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ అద్భుతంగా ఉందని కర్ణాటక పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ప్రియాంక మేరీ కొనియాడారు. శుక్రవారం కర్ణాటకకకు చెందిన పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ప్రియాంకమేరీ బళ్లారి జిల్లాపరిషత్‌ సీఈఓ నందిని, పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌ డైరెక్టర్‌ రేవన్న, ఎస్‌ఐఆర్‌టీ రీసోర్స్‌పర్సన్‌ గణేష్‌ ప్రసాద్‌, స్టేట్‌రీసోర్స్‌ పర్సన్‌ యాలక్కీగౌడ్‌, ఎస్‌ఐఆర్‌డీ ట్రైన ర్‌ ఉమేష్‌, బళ్లారి గంగారామ్‌ బృందం, పెనుకొండలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ పనితీరును అఽధ్యయనం చేయడానికి సోమందేపల్లికి వచ్చారు. ఈ బృందానికి జాయింట్‌ కలెక్టర్‌ సిరి, డీటీఓ పార్వతమ్మ, ఎంపీడీఓ నాగరాజు, తదితరులు స్వాగతం పలికారు.   సచివాలయ వ్యవస్థను కర్ణాటకలో కూడా అమలు జరిగేలా ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తామన్నారు. 


Advertisement
Advertisement
Advertisement