5 నుంచి కార్తీక మాసోత్సవాలు: ఈవో

ABN , First Publish Date - 2021-10-25T04:50:40+05:30 IST

కార్తీక మాసోత్సవాలు నవంబరు 5 తేదీ నుంచి డిసెంబరు 4 వరకు నిర్వహిస్తున్నామని ఈవో ఎస్‌. లవన్న అన్నారు.

5 నుంచి కార్తీక మాసోత్సవాలు: ఈవో
వైద్యశాలను పరిశీలిస్తున్న ఈవో ఎస్‌. లవన్న


శ్రీశైలం, అక్టోబరు 24:  కార్తీక మాసోత్సవాలు నవంబరు 5 తేదీ  నుంచి డిసెంబరు 4 వరకు  నిర్వహిస్తున్నామని ఈవో ఎస్‌. లవన్న అన్నారు. ఆదివారం  శ్రీశైలం క్షేత్రంలోని దేవస్థానం వైద్యశాలను, కళ్యాణకట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఉత్సవాలకు వచ్చే  భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పించేందుకు చర్య లు తీసుకుంటున్నా మన్నారు. కళ్యాణకట్టలో విధులు నిర్వహించే సిబ్బంది అంతా కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ, తలనీలాలు తీసే పరికరాలను ఎప్పటికపుడు శుభ్రపరుస్తుండాలని సూచించారు. కళ్యాణకట్టలో శుభ్రతపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, పచ్చదనానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కళ్యాణకట్ట ప్రాంగణంలో కొవిడ్‌ నిబంధనలను సూచించే సూచికబోర్డులను మరిన్ని ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా దేవస్థానం వైద్యశాలను పరిశీలించారు. వైద్యశాలకు రోజూవారీగా వచ్చే ఓపీ పేషంట్ల గురించి వివరాలు తెలసుకొని, వైద్యం కోసం వచ్చే రోగులకు అనుగుణంగా ఔషదాలను సిద్ధంగా ఉండేలా చూడాలన్నారు. అలాగే వైద్యశాలకు అవసరమయ్యే ఔషదాలకు  సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేయాలన్నారు. పరిశీలనలో దేవస్థానం ఏఈవో నటరాజరావు, పారిశుధ్య విభాగపు పర్యవేక్షకులు స్వాములు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-25T04:50:40+05:30 IST