Advertisement
Advertisement
Abn logo
Advertisement

భక్తిశ్రద్ధలతో కార్తీక సోమవారం

జోరువానలోనూ భక్తులు బారులు 

నెల్లూరు (సాంస్కృతికం) నవంబరు 29 : కార్తీక మాసం చివరి సోమవారాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. జోరువాన కురుస్తున్నా భక్తులు బారులుతీరి అభిషేకాల్లో పాల్గొన్నారు. నగరంలోని మూలస్థానేశ్వరాలయంలో పాలాభిషేకాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు,  కార్తీక దీప సమారాధనలు, పల్లకీసేవ, ప్రాకారోత్సవాలు జరిగాయి. వేడుకలను ఆలయ చైర్మన్‌ వెంకటేశ్వరరెడ్డి, ధర్మకర్తలు, ఈవో వేణుగోపాల్‌ పర్యవేక్షించారు. రాజరాజేశ్వరి ఆలయంలో సుందరేశ్వరస్వామికి పాలాభిషేకాలు, పంచామృతాభిషేకాలు, మహాన్యాస రుద్రాభిషేకాలు జరిగాయి. కార్యక్రమాలను ఆలయ చైర్మన్‌ రత్నంజయరామ్‌, ఈవో, సహాయ కమిషనర్‌ వెండిదండి శ్రీనివాసరెడ్డి  పర్యవేక్షించారు. నవాబుపేట భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయంలో పాలాభిషేకాలు, పంచామృతాభిషేకాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు జరిగాయి. కార్యక్రమాలను ఆలయ ధర్మకర్తలు, ఈవో నవీన్‌కుమార్‌, ఉభయకర్తలు పర్యవేక్షించారు. ఉస్మాన్‌సాహెబ్‌పేట కాశీవిశ్వనాఽథస్వామి ఆలయంలో పాలాభిషేకాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అన్నప్రసాదం వితరణ, పూలంగిసేవ, కార్తీక దీపాలంకరణ జరిగాయి. ఆలయ చైర్మన్‌ కామేశ్వరరావు, ధర్మకర్తలు పర్యవేక్షించారు. వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో మహిళా భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూలంగిసేవ చేశారు. శివలింగాకారంలో కార్తీక దీపాలు వెలిగించారు.  నగరంలోని స్టోన్‌హౌస్‌పేట శివాజీనగర్‌లోని పార్వతీ సమేత పంచభూతేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు, పాలాభిషేకాలు, పంచామృ తాభిషేకాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు జరిగాయి. స్వామివారి లింగాకారానికి ప్రత్యేక అలంకారం జరిగింది.

Advertisement
Advertisement