Advertisement
Advertisement
Abn logo
Advertisement

యాదాద్రి క్షేత్రంలో ‘కార్తీక’ సందడి

యాదాద్రి టౌన్‌, డిసెంబరు1: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో బుధవారం కార్తీక సందడి నెలకొంది. కార్తీకమాసం ముగుస్తుండడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో క్షేత్ర సందర్శనకు విచ్చేసి ఇష్టదైవాలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శివకేశవుల దర్శనాలు.. మొక్కు పూజల నిర్వహణకోసం ప్రైవేటు ఆటోలు, ఆర్టీసీ, దేవస్థాన బస్సులలో కొం డపైకి చేరుకున్నారు. దర్శనాలు.. ఆర్జిత సేవల నిర్వహణ కోసం క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉం డి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. బాలాలయంలో నిత్య కల్యాణోత్సవం, ఆర్జిత సేవలు, కొండకింద పాత గోశాలలోని వ్రత మండపంలో సత్యనారాయణ వ్రతపూజలలో భక్తులు కుటుంబసమేతం గా పాల్గొన్నారు. కార్తీకమాసం చివరి వారంకావడం తో తెలంగాణ అన్నవర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన యాదాద్రిలో 676మంది దంపతులు సత్యనారాయ ణ స్వామి వ్రతపూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామికి సత్యనారాయణస్వామి వ్రతపూజల ద్వారా రూ.3.38లక్షల ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. భక్తులు అధికసంఖ్యలో వాహనాల్లో తరలిరావడంతో ఆల య ఘాట్‌రోడ్డు, పట్టణంలో పలుమార్లు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. స్వామికి వివిధ విభాగాల ద్వారా రూ.15,16,144 ఆదాయం సమకూరింది.  


స్వామికి ఘనంగా నిత్యపూజలు

యాదాద్రీశుడి సన్నిధిలో నిత్యపూజలు ఘనంగా నిర్వహించారు. సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన అర్చకులు బాలాలయంలో కవచమూర్తులను కొలిచారు. ఉత్సవమూర్తులను అభిషేకించి తులసీదళాలతో అర్చించారు. మండపంలో సుదర్శనహో మం, నిత్యకల్యాణపర్వాలు ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లను గజవాహనసేవలో అలంకరించి సేవోత్సవం నిర్వహిం చి బాలాలయంలో ఊరేగించారు. ఆలయంలో సువర్ణ పుష్పార్చనలు, అష్టోత్తరాలు, వ్రతమండపం లో సత్యదేవుడి వ్రతపూజలు కొనసాగాయి. కొండపైన శివాలయంలో రామలింగేశ్వరుడికి, ఉపాలయంలో చరమూర్తులకు నిత్యపూజలు స్మార్త సంప్రదాయరీతిలో కొనసాగాయి.


యాదాద్రీశుడి సేవలో టీఎ్‌సపీఎస్సీ సభ్యుడు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రాన్ని బుధవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎ్‌సపీఎస్సీ) సభ్యుడు కారెం రవీందర్‌రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా విచ్చేసిన ఆయన కు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేకదర్శన సౌకర్యం కల్పించారు. బాలాలయ కవచమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నా రు. పూజలనంతరం అర్చకులు ఆయన కు ఆశీర్వచనం నిర్వహించగా.. దేవస్థాన అధికారు లు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.  

Advertisement
Advertisement