కసుమూరులో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2020-11-23T05:16:59+05:30 IST

దక్షణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన్‌వలి దర్గాలో అదివారం భక్తుల సందడి నెలకొంది. రాష్ట్రం నలమూలల నుంచే కాకుండా బయట ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.

కసుమూరులో భక్తుల రద్దీ

 వెంకటాచలం, నవంబరు 22: దక్షణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన్‌వలి దర్గాలో అదివారం భక్తుల సందడి నెలకొంది. రాష్ట్రం నలమూలల నుంచే కాకుండా బయట ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ నిబంధనలను పాటిస్తూ దర్గాలోనికి భక్తులను అనుమతించారు. మాస్కులు ధరించ డం, శానిటైజర్లు వినియోగం, సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని వక్ప్‌బోర్డు సిబ్బంది దర్గా ప్రధాన ద్వారం వద్దే భక్తులకు సూచిస్తున్నారు. అందుకు సంబం ధించిన ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. మస్తాన్‌ స్వామి వారి దర్గాకు పూలు, విద్యుత్‌ దీపాలతో ప్రత్యేకంగా అలంక రించారు. ఈ సందర్భంగా కొందరు భక్తులు అన్నదాన కార్యక్రమాలు చేపట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు.   

Updated Date - 2020-11-23T05:16:59+05:30 IST