సీఎంగా కేసీఆర్‌ అనర్హుడు

ABN , First Publish Date - 2022-02-04T05:29:22+05:30 IST

రాజ్యాంగం మార్చాలని అవమానించిన కేసీఆర్‌ సీఎంగా అనర్హుడ ని బీజేపీ నాయకుడు నాగూరావు నామాజీ పేర్కొన్నాడు.

సీఎంగా కేసీఆర్‌ అనర్హుడు
నారాయణపేటలో జై భీమ్‌ దీక్షలో బీజేపీ నాయకులు

- బీజేపీ నాయకుడు నాగూరావు నామాజీ 

- బీజేపీ ఆధ్వర్యంలో భీమ్‌ దీక్షలు

నారాయణపేట, ఫిబ్రవరి 3 : రాజ్యాంగం మార్చాలని అవమానించిన కేసీఆర్‌ సీఎంగా అనర్హుడ ని బీజేపీ నాయకుడు నాగూరావు నామాజీ పేర్కొన్నాడు. గురువారం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యా లయంలో రాజ్యాం గాన్ని అవమానించడాన్ని నిరసిస్తూ జై భీమ్‌ దీక్ష చేపట్టారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి రాజ్యాంగంపై ఇష్ట మొచ్చినట్లు మాట్లాడడం ఏంటని ప్ర శ్నించారు.  కేసీఆర్‌ రాజ్యాంగంపై చేసిన మాటల ను బేషరతుగా వెనక్కీ తీసుకొని జాతికి క్షమాపన చెప్పాలని, రాజ్యాంగాన్ని అవహేళన చేసిన సీఎంపై దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సత్యనారాయణ యాదవ్‌, మదన్‌, సుజాత, విజయ్‌, రఘువీర్‌, ఆశప్ప, కృష్ణ, వెంకటయ్య, శ్యాంసుందర్‌, రాము, రఘు, హన్మంత్‌రావు, సాయన్న, భీంసేన్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

దామరగిద్ద :  బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద ఆ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జై భీమ్‌ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మండల నాయకుడు గోపాల్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని అవమానించడం కాకుండా మారుస్తానని చెప్పడంపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలన్నారు. కార్యక్ర మంలో నాయకులు అశోక్‌, మైపాల్‌రెడ్డి, లక్ష్మీ నా రాయణ, శ్రీనివాస్‌, ఆంజనేయులు గౌడ్‌, వీరప్ప, సాయిలు, నారా యణ ఉన్నారు. 

కృష్ణ : కేసీఆర్‌ ఖబర్దార్‌ మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు సీఎంను మార్చాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సోమ శేఖర్‌గౌడ్‌ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన జై భీమ్‌ దీక్ష కు ఆయన హాజరై మాట్లాడారు. కేసీఆర్‌ అయిదుసార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా, ముఖ్య మంత్రిగా అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం పెట్టిన బిక్షతో  పదవులు అనుభవిస్తున్నావని అన్నారు.

ఊట్కూర్‌  : మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బీజేపీ ఆఽధ్వర్యంలో జైభీమ్‌ దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆర్టికల్‌ 3 ద్వారానే వచ్చిందని సీఎం కేసీఆర్‌ గుర్తించుకోవాలన్నారు. తన వైఖరిని మార్చుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. మండలాధ్యక్షుడు రమేష్‌, ఎంపీటీసీ కిరణ్‌, ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, నాయకులు లక్ష్మణ్‌, కృష్ణయ్యగౌడ్‌, గోపాల్‌, వెంకటేష్‌గౌడ్‌, శాంతిగౌడ్‌, మల్లేష్‌, అశోక్‌, భీంరెడ్డి, రాజు, ఆనంద్‌, తిమ్మప్ప, శంకర్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం 

మరికల్‌ : రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడి న కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో గు రువారం మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్ర హానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భం గా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఆర్టికల్‌ 3 ప్రకారం రాష్ట్రం ఏర్పాటు జరిగిందని, రాజ్యాంగం లేకుంటే నీవెక్కడ ఉండే వాడివో గుర్తుపెట్టుకోవా లన్నారు. రాజ్యాంగం అమలు చేయడం చేతగాకే కారుకూతలు కూస్తూ కాలం గడుపుతున్న కేసీఆర్‌ కు ప్రజలు తగ్గిన బుద్ధి చెప్పాలన్నారు.  కార్యక్ర మంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వేణు, వెంకటేష్‌, నర్సిములు, రమేష్‌ పాల్గొన్నారు.




Updated Date - 2022-02-04T05:29:22+05:30 IST