Abn logo
Jul 8 2020 @ 05:09AM

నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలి

జిల్లాలో 67 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం 

రాష్ట్ర మంత్రి ఐకే రెడ్డి


మంచిర్యాల టౌన్‌, జూలై 7: హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని రాష్ట్ర అటవీ, గృహ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నా రు. ఆరో విడత హరితహారంలో భాగంగా మంగళవారం  జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గ్రీన్‌సిటీలో ఏర్పాటు చేసిన రాశివ నం, యాదాద్రి వనంతోపాటు మెడిలైఫ్‌ ఆసుపత్రి ముం దు రోడ్డు డివైడర్ల మధ్యలో మొక్కలు నాటి, నీళ్లు పోశారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా కేసీఆర్‌ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈయేడు పట్టణాలు, గ్రామాల్లో అడవుల పెంపకం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో 60 లక్షల మొక్కలను లక్ష్యంగా పెట్టుకొన్నట్లు తెలిపారు.


హరితహా రం కార్యక్రమానికి మున్సిపాలిటీ ఆదాయంలో 10 శాతం నిధులు ప్రత్యేకంగా కేటాయించామన్నారు. బైపాస్‌ రోడ్డు లో గల తెలంగాణ తల్లి విగ్రహానికి మంత్రి పూలమాలలు వేశారు. ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్‌, కలెక్టర్‌ భారతిహోళికేరి, డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఆర్డీవో జాడి రాజేశ్వర్‌, జిల్లా అటవీశాఖ ఇన్‌చార్జి అధికారి లావణ్య, మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌చైర్మన్‌ గాజుల ముకేష్‌గౌడ్‌, కమిషనర్‌ జి స్వరూపారాణి, మేనేజర్‌ వెంకటేశ్వర్‌రావు, అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.  


రైతు వేదికల నిర్మాణాలతో విప్లవాత్మక మార్పులు 

బెల్లంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలు వ్యవసాయ చరిత్రలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టను న్నాయని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. కన్నాల, పెర్కపల్లి  గ్రామాల్లో రైతు వేదిక భవన నిర్మాణాలకు శంకుస్ధాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రైతులను రాజును చేసేందుకు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రైతుబంధు, గిట్టుబాటు ధరలు కల్పిస్తూ రైతు ల సంక్షేమానికి పాటుపడుతున్నారని తెలిపారు. రైతు వేదికల చర్చలు జరుపుకుని మార్కెటింగ్‌కు అనుగుణం గా పంటలు వేస్తూ లాభాలు గడించాలని పేర్కొన్నారు.  హరితహారంలో భాగంగా బెల్లంపల్లిలోని ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో మొక్కలు నాటారు. ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో 40 వేల రకాల మొక్కలు నాటడానికి ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. ఎంఎల్‌సీ పురాణం సతీష్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీఓదెలు,  ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, గ్రంథాలయ చైర్మన్‌ ప్రవీణ్‌, సీపీ సత్యనారా యణ, కలెక్టర్‌ భారతి హోళికేరి, డీసీపీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి, ఏసీపీ రహెమాన్‌ పాల్గొన్నారు. 


పచ్చదనం పెంపు అందరి బాధ్యత

నస్పూర్‌: పచ్చదనం పెంపును అందరూ బాధ్యతగా తీసుకోవాలని దేవాదాయ, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రెండోవార్డు లక్ష్మినగర్‌లో  మొ క్కలను నాటారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఎమ్మెల్సీ  సతీష్‌కుమార్‌, కలెక్టర్‌తో కలిసి మంత్రి మొక్కలు నాటి మాట్లాడారు. మంగళవారం ఒక్క రోజే లక్ష వరకు మొక్కలను నాటామని మంత్రి పేర్కొన్నారు.  మున్సిపల్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, తహసీల్దార్‌ శేఖర్‌, కమిషనర్‌ రాధా కిషన్‌, అటవీ శాఖ అధికారి లావణ్య, కౌన్సిలర్‌ బోయ మల్లయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు, కౌన్సిలర్‌ వంగ తిరుపతి పాల్గొన్నారు.  


సింగరేణి అతిథి గృహంలో రాష్ట్ర మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డిని టీబీజీకేఎస్‌ నాయకులు సురేందర్‌ రెడ్డి, వెం గల కుమారస్వామి, గోపాల్‌ రెడ్డి, చిలుముల రాజమల్లు, నీలం సదయ్యలు  కలిసి పుష్పగుచ్ఛం అందించారు. 


భవిష్యత్‌ తరాలు బాగుండాలంటే మొక్కలు నాటాలి 

కన్నెపల్లి: భవిష్యత్‌ తరాలు బాగుండాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు.  కొత్తపల్లిలో  మొక్కలు నాటారు. మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాల్లో, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఎంపీపీ సృ జననర్సింగరావు, నిరంజన్‌గుప్తా, పాల్గొన్నారు. 


మాజీ విప్‌ను పరామర్శించిన మంత్రి 

మందమర్రి: కంటి ఆపరేషన్‌ చేయించుకున్న మాజీ విప్‌ నల్లాల ఓదెలును రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పరామర్శించారు. మంగళ వారం పట్టణంలోని 2వ జోన్‌లోని ఓదెలు నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన వెంట ఉమ్మడి జిల్లా ఎంఎల్‌సీ పురాణం సతీష్‌ ఉన్నారు. 

Advertisement
Advertisement