Abn logo
Mar 31 2021 @ 08:26AM

నన్ను గెలిపిస్తే ఫుట్‌బాల్ వరల్డ్ కప్ చూపిస్తా: స్వతంత్ర అభ్యర్థి వింత హామీ!

తిరువనంతపురం: కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపధ్యంలో వివిధ పార్టీల అభ్యర్థులు... ప్రజలకు పలు హామీలు గుప్పిస్తున్నారు. ఈ నేపధ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సులెమాన్ హాజీ తాను ఎన్నికల్లో గెలిస్తే స్థానిక క్లబ్బులలో ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తానని తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో గెలిచిన టీమ్‌ను 2022లో కతర్‌లో జరిగే ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు తీసుకు వెళతానని హామీ ఇచ్చారు. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 2న జరగనుంది. వ్యాపారవేత్త అయిన సులెమాన్ హాజీ... కొండోట్టి అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. వామపక్షాల మద్దతుతో సులెమాన్ ఎన్నికల బరిలోకి దిగారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement