కేరళ లిక్కర్ యాప్‌లో చిక్కులతో మందు బాబుల్లో నిరుత్సాహం

ABN , First Publish Date - 2020-05-28T22:20:28+05:30 IST

కేరళలో మందు బాబుల సహనానికి పెద్ద పరీక్ష ఎదురవుతోంది

కేరళ లిక్కర్ యాప్‌లో చిక్కులతో మందు బాబుల్లో నిరుత్సాహం

తిరువనంతపురం : కేరళలో మందు బాబుల సహనానికి పెద్ద పరీక్ష ఎదురవుతోంది. మద్యపాన ప్రియుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ‘బెవ్‌క్యూ’ యాప్‌లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం, మద్యం కోసం టోకెన్ బుక్ చేసుకోవడం చాలా కష్టంగా మారింది. దీంతో మద్యపాన ప్రియులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. 


ఈ యాప్‌ను బుధవారం అర్ధరాత్రి నుంచి అందుబాటులో ఉంచారు. దీనిలోని సాంకేతిక లోపాలు మద్యపాన ప్రియుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. బుధవారం ఉదయానికి  దాదాపు 3 లక్షల మంది దీనిని డౌన్‌లోడ్ చేసుకున్నారు. 2.82 లక్షల టోకెన్లు జనరేట్ అయ్యాయి. 


ఈ టోకెన్లపైన ఉన్న క్యూఆర్ కోడ్‌ను బార్లు, మద్యం దుకాణాల్లో స్కాన్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఈ టోకెన్ నంబర్లను ఓ పుస్తకంలో రాసుకుని మద్యం సరఫరా చేస్తున్నారు. 


ఈ యాప్‌ను రూపొందించిన సొల్యూషన్ ప్రొవైడర్ ఫేస్‌బుక్ పేజీలోకి మద్యపాన ప్రియులు ప్రవేశించి, విమర్శలు గుప్పించారు. 


Updated Date - 2020-05-28T22:20:28+05:30 IST