వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న బాలసదనం విద్యార్థులు
సంగారెడ్డి టౌన్, జనవరి 26: 72వ గణతంత్ర వేడుకల సందర్భంగా మంగళవారం గవర్నర్ తమిళసై సౌందర రాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంగారెడ్డిలోని బాలసదనం విద్యార్థులతో మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ‘వర్చువల్ ఇంటరాక్షన్ విత్ చిల్డ్రన్ ఆర్ స్టేట్ హోం’ కార్యక్రమంలో భాగంగా బాలసదనం విద్యార్థులతో మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ మాట్లాడడంతో విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. బాలసదనంలో అందుతున్న సేవలను గవర్నర్‌కు వివరించారు. విద్యార్థులు దేవకీరాణి, లాలీబాయి, భవాని చైల్డ్‌లైన్ 1098 సేవల గురించి వివరించారు. కాగా భవాని పాడిన పాటకు గవర్నర్ తమిళసై అభినందిస్తూ భవిష్యత్తులో మంచి గాయనిగా గుర్తింపు తెచ్చుకోవాలని కాంక్షించారు. బాలసదనంలో చదువుకుంటున్న విద్యార్థులకు రాజ్ భవన్‌ను సందర్శించి తనతో మాట్లాడే అవకాశం కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్డీవో మెంచు నాగేశ్, జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, రెడ్‌క్రాస్ సొసైటీ సెక్రటరీ వనజారెడ్డి, డీఐవోలు చందర్, కిష్టప్ప, జిల్లా బాలల సంరక్షణ అధికారి రత్నం, బాలసదనం సూపరింటెండెంట్ విజయకుమారి, చైల్డ్‌లైన్ కో ఆర్డినేటర్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.