Abn logo
Sep 25 2020 @ 06:20AM

రాష్ట్రంలో మత మార్పిడులు

Kaakateeya

కుల మతాల మధ్య వైషమ్యాలు పెంచుతున్నారు

 మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి


కర్నూలు(ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 24: రాష్ట్రంలో మతమార్పిడి చర్యలు కొనసాగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు బైౖరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి ఆరోపించారు. బైౖరెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో హిందువులను ఎలా కాపాడుకోవాలో డిక్లరేషన్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిని డిమాండ్‌ చేశారు.


హిందువుల దేవాలయాలను, సంస్కృతిని కాపాడటానికి చేతకాకపోతే కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పాలన్నారు. హిందువుల దేవాలయాలపైన దాడులు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు.  రాష్ట్రంలో శాంతియుత వాతావరణం కలుషితమై అభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు.  కులాలు, మతాలకు రాజకీయాలను ముడిపెట్టి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారని ఆరో పించారు.


  తిరుమలలో అన్యమతస్థుల దర్శనానికి డిక్లరేషన్‌పై సంతకం చేడం  అనాదిగా వస్తున్న ఆచారమని, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి దీన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.  గోదావరి దేవాలయంలో ఆంజనేయస్వామి విగ్రహం చేతులు విరగొట్టినా చర్యలు తీసుకోకపోవడంతోనే పత్తికొండలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారన్నారు. పత్తికొండ సంఘటనలో బీజేపీ కార్యక్రమాన్ని అడ్డుకోడానికి నాయకులును, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం దారుణమన్నారు. 

Advertisement
Advertisement
Advertisement