కొత్త ప్రయోగాలతో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

ABN , First Publish Date - 2020-02-28T11:15:13+05:30 IST

పాఠశాల స్థాయి నుంచే కొత్త ప్రయోగాలకు నాంది పలికి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని డీఈవో గోవిందరాజులు పేర్కొన్నారు.

కొత్త ప్రయోగాలతో విజ్ఞానాన్ని  పెంపొందించుకోవాలి

డీఈవో గోవిందరాజులు


తాడూరు, ఫిబ్రవరి 27 : పాఠశాల స్థాయి నుంచే కొత్త ప్రయోగాలకు నాంది పలికి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని డీఈవో గోవిందరాజులు పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సైన్స్‌డేను పురస్కరించుకొని విద్యార్థులు తయారు చేసిన 160 ప్రయోగాలను ప్రదర్శనలో ఉంచారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీఈవో హాజరై ప్రదర్శనలను తిలకించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలకు సంబంధించిన ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రోహిణి, సర్పంచ్‌ యాదమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు రేణుక, ప్రధానోపాధ్యాయుడు పర్వత్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 


పాఠశాలల్లో బయోమెట్రిక్‌ తప్పనిసరి

నాగర్‌కర్నూల్‌ అర్బన్‌/అచ్చంపేట టౌన్‌/బల్మూర్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో విధులకు హాజరవుతున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా బయోమెట్రిక్‌ను ఉపయోగించాలని డీఈవో గోవిందరాజులు పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులకు, సీఆర్పీలకు నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి పాఠశాలలో బమోమెట్రిక్‌ విధానాన్ని విధిగా అమలు చేయాలని, విద్యార్థి ప్రగతి కోసం ప్రభుత్వం నిర్ధేశించిన పది సూత్రాలను పాఠశాలల గోడలపైన రాయించాలన్నారు.  ఏక్‌భారత్‌ ఏక్‌ శ్రేష్ట ప్రోగ్రాంలును విజయవంతంగా నిర్వహించాలన్నారు. పిట్‌ ఇండియా ప్రోగ్రాం ద్వారా నిర్వహించే కార్యక్రమాల్లో పాఠశాల విద్యా అభివృద్ధి, స్వచ్ఛభారత్‌ని విజయవంతం చేయాలన్నారు. సీఆర్పీలు క్రమం తప్పకుండా పాఠశాలలను సందర్శించి సంబంధిత రిపోర్టులను డీఈవో కార్యాలయానికి అందజేయాలన్నారు.


అదే విధంగా అచ్చంపేట పట్టణంలోని ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు ప్రైవేటు పాఠశాలల ప్రిన్సిపాల్‌ సమావేశంలో డీఈవో మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు పాఠశాలలు జీవో నెం 1 ప్రకారం నియమ నిబంధనలు పాటించాలన్నారు. అదే విధంగా శాలసిద్ధి, సీసీఈ, ఫిట్‌ఇండియాను అచ్చంపేట అన్ని పాఠశాలలో పూర్తిచేశారని, అమ్రాబాద్‌ మండలంలోని పాఠశాలలు వెనకబడ్డాయని త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం బల్మూర్‌ మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలను తనిఖీ చేసి పది విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు. కార్యక్రమంలో సెక్టోరల్‌ అధికారి మంతటి నారాయణ, అంజి, ఏవు .రఘు, సీఆర్పీలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-28T11:15:13+05:30 IST