కొల్లు రవీంద్రకు నోటీసులు

ABN , First Publish Date - 2020-12-04T06:04:51+05:30 IST

ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గుడివాడలోని మంత్రి కొడాలి నాని నివాసంలో గురువారం బాంబ్‌స్క్వాడ్‌ తనిఖీలు నిర్వహించారు.

కొల్లు రవీంద్రకు నోటీసులు

 జవాబిచ్చిన రవీంద్ర, కాశీవిశ్వనాథం

మచిలీపట్నం టౌన్‌, డిసెంబరు 3 : మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)పై దాడి చేసిన బడుగు నాగేశ్వరరావుకు, తెలుగుదేశం పార్టీకి ఏమీ సంబంధం లేదని చెప్పిన మాజీ మంత్రి, పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రకు, మునిసిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ పంచపర్వాల కాశీవిశ్వనాథంకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పేర్ని నానిపై దాడి జరిగిన సందర్భంగా మీడియాతో కొల్లు రవీంద్ర మాట్లాడిన అంశంపై పోలీసులు నోటీసులు జారీ చేశారు. మీడియా వద్ద వ్యక్తం చేసిన అంశాన్ని ఆసరాగా తీసుకుని దాడి వివరాలు ఏమైనా ఉంటే చెప్పమని ఇనకుదురు పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై కొల్లు రవీంద్ర జవాబిచ్చారు. ఘటన జరిగిన సాయంత్రం గుంటూరు జిల్లా పొన్నూరులో ఉన్నానని, మీడియా ప్రతినిధులు ప్రశ్నించిన మీదట జవాబిచ్చారన్నారు. ఘటన జరిగిన తరువాత ఎస్పీ మీడియాతో మాట్లాడిన మాటలను సోషల్‌ మీడియాలో చూశానని, దీన్ని ఆధారంగా చేసుకుని మీడియాకు వాయిస్‌ ఇచ్చానని చెప్పారు. 

Updated Date - 2020-12-04T06:04:51+05:30 IST