Abn logo
Jul 9 2020 @ 21:45PM

టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు : ఎమ్మెల్యే బాల వీరాంజనేయ

ప్రకాశం : జగన్ సర్కార్ అసమర్థతను ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని కొండేపి టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. దళిత నేతల అభ్యున్నతికి పాటుపడుతున్నామంటున్న అధికార వైసీపీ ప్రభుత్వం వారికి గత ప్రభుత్వ హాయాంలో చేపట్టిన సబ్‌ప్లాన్‌ కేటాయింపుల్లో సగం మాత్రమే కేటాయించిందని విమర్శలు గుప్పించారు. సెంటు ఇంటి పట్టా ఇస్తున్నామంటూ ఎస్సీ ఆధీనంలో ఉన్న మూడు వేల ఎకరాల అసైన్‌మెంట్ భూములను ప్రభుత్వం లాక్కుందని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ రాజ్యసభ సీటును కూడా దళితులకు కేటాయించకుండా రిలయన్స్ వారికి బేరం పెట్టిందని ఎమ్మెల్యే ఆరోపించారు. దళితులలో ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే అంబేద్కర్‌ స్మృతివనం తరలింపు నాటకం ఆడుతోందని బాలవీరాంజనేయ చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement
Advertisement