ప్రకృతి వ్యవసాయంతో ఆహారభద్రత

ABN , First Publish Date - 2020-08-12T11:10:02+05:30 IST

ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటల ద్వారా అధిక దిగుబడులతో పాటు ఆహార భద్రత ఉంటుందని కోవెల ఫౌండేషన్‌ జిల్లా ప్రోగ్రామింగ్‌ ..

ప్రకృతి వ్యవసాయంతో ఆహారభద్రత

గంగవరం, ఆగస్టు 11: ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటల ద్వారా అధిక దిగుబడులతో పాటు ఆహార భద్రత ఉంటుందని కోవెల ఫౌండేషన్‌ జిల్లా ప్రోగ్రామింగ్‌ మేనేజర్‌ డాక్టర్‌ డి.శ్రీనివాసరావు అన్నారు.  కురమగొందిలో ప్రకృతి వ్యవసాయం చేయాలని పెద్దలు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామంలోని 80 మంది రైతులు తమకు ఉన్న భూమిలో ఎటువంటి పురుగుమందులు కానీ రసాయనాలు  కానీ ఉపయోగించకుండా పంటలు పండించాలన్నారు. పంట ఎటువంటి తెగుళ్లు ఆశించకుండా విత్తనం వేసేటప్పుడే విత్తనశుద్ధి చేసి నాటాలన్నారు.   గ్రామంలోని ప్రతీ కుటుంబానికి 11 రకాల కూరగాయల విత్తనాలను ఇచ్చి 365 రోజులు పరిపూర్ణ ఆహార భద్రతను కల్పిస్తామన్నారు. క్లస్టర్‌ కో-ఆర్డినేటర్‌ సీతయ్య, రైతు ఉత్పత్తిదారుల సంఘం సభ్యులు కోవెల ఫౌండేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-12T11:10:02+05:30 IST