అతిసూక్ష్మ తుంపరలతో కొవిడ్‌ వ్యాపించదు

ABN , First Publish Date - 2020-10-29T06:34:30+05:30 IST

దగ్గు, తుమ్ము, మాట్లాడే సందర్భాల్లో వెలువడే అతిసూక్ష్మ తుంపరల వల్ల కరోనావ్యాప్తి జరగదని నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌ వర్సిటీ

అతిసూక్ష్మ తుంపరలతో కొవిడ్‌ వ్యాపించదు

లండన్‌, అక్టోబరు 28: దగ్గు, తుమ్ము, మాట్లాడే సందర్భాల్లో వెలువడే అతిసూక్ష్మ తుంపరల వల్ల కరోనావ్యాప్తి జరగదని నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. సూక్ష్మ తుంపర లు భారీ వైరల్‌ లోడ్‌ను మోసుకెళ్లలేవని స్పష్టంచేశా రు. అవి ఎంత దూరం ప్రయాణిస్తున్నాయి? అనేది తెలుసుకునేందుకు లేజర్‌ సాంకేతికతతో జరిపిన ప్రయోగాల్లో ఈ విషయం వెల్లడైందన్నారు. ఇంట్లో సరైన వెంటిలేషన్‌ వ్యవస్థ ఉంటే అతిసూక్ష్మ తుంపరల గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. 

Updated Date - 2020-10-29T06:34:30+05:30 IST