సంక్రాంతిపై కొవిడ్‌ ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2022-01-15T05:29:11+05:30 IST

సంక్రాంతి పండుగపై కొవిడ్‌ ప్రభావం కనిపిస్తున్నది. ఈపండుగకు రంగవల్లులు, గొబ్బెమ్మలు, చెరుకుగడలు, జొన్నకంకులు, శనగ, కుసుమదంట్లను పెట్టడం ఆనవాయితీ.

సంక్రాంతిపై కొవిడ్‌ ఎఫెక్ట్‌
సంక్రాంతి రోజు ఇళ్లపై వేసే శనగ,జొన్న, కుసుమ మొక్కలు కొనేవారి కోసం ఎదురుచూస్తున్న గ్రామస్థులు

రంగులు కొనేవారు కరువు 

పతంగుల అమ్మకాలూ అంతంతే


 ఆంధ్రజ్యోతిప్రతినిధి, సంగారెడ్డి: సంక్రాంతి పండుగపై కొవిడ్‌ ప్రభావం కనిపిస్తున్నది. ఈపండుగకు రంగవల్లులు, గొబ్బెమ్మలు, చెరుకుగడలు, జొన్నకంకులు, శనగ, కుసుమదంట్లను పెట్టడం ఆనవాయితీ. గ్రామాల్లో ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. ఇక పట్టణాల్లో అయితే చుట్టుపక్కల గ్రామాల నుంచి తీసుకొచ్చి అమ్ముతుంటారు. సంగారెడ్డిలోనూ వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నా వీటిని కొనేందుకు జనాలు ఆసక్తి చూపడం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు విక్రయించినా కనీస కూలీ రూ.800 అయినా గిట్టుబాటు కావడం లేదని తాళ్లపల్లి, కులబ్‌గూర్‌ చెందిన అమ్మకందారులు తెలిపారు. రంగులు, గాలిపటాల విక్రయాలు కూడా బాగా తగ్గాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు వీటిపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తున్నది. 

Updated Date - 2022-01-15T05:29:11+05:30 IST