కొవిడ్‌ నిబంధనలను పాటించాలి

ABN , First Publish Date - 2021-03-05T05:17:21+05:30 IST

హాస్టళ్లలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థు లు కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారిణి రజిత ఆదేశించారు.

కొవిడ్‌ నిబంధనలను పాటించాలి

నిజాంసాగర్‌, మార్చి 4 : హాస్టళ్లలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థు లు కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారిణి రజిత ఆదేశించారు. నిజాంసాగర్‌ మండలం అచ్చంపేట గ్రామంలోని సమీకృత హాస్టల్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాస్టల్‌లో పరిశుభ్రత పాటిస్తూ కొవిడ్‌ నిబంధనలను తప్పకుండా పాటించి, వ్యాధి బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. హాస్టల్‌లో విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు భౌతిక దూరంతో పాటు మాస్కులు ధరించేటట్లు చూడాలని, ఒక్కొక్క గదిలో 20 మంది విద్యార్థులకే పరిమితం చేయాలని అన్నారు. డైనింగ్‌ హాల్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ శానిటేషన్‌ చేయించాలన్నారు. పాఠశాలలో చల్లని అల్పాహారాన్ని ఇవ్వకూడదని అన్నారు. హాస్టల్‌లో పరిసరాల ప్రాంతాలన్నింటిని శుభ్రం గా ఉంచాలని, పిల్లల తల్లిదండ్రులు వచ్చినట్లయితే వారిని దూరంగా ఉండి విద్యార్థులతో మాట్లాడించాలన్నారు. హాస్టళ్లలో కరోనా సోకకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత వెల్ఫేర్‌ అధికారులదేనన్నారు. ఆమె వెంట సంక్షేమ అధికారి లియో, కిశోర్‌లున్నారు.

Updated Date - 2021-03-05T05:17:21+05:30 IST