కృష్ణా జిల్లాలో దారుణం

ABN , First Publish Date - 2021-01-13T13:23:10+05:30 IST

కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు.

కృష్ణా జిల్లాలో దారుణం

విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. వీరపనేనిగూడెం బ్యాంకు నుంచి ఇంటికి వెళ్తున్న మహిళకు లిఫ్ట్ ఇచ్చిన యువకులు... మార్గమధ్యంలో వాహనాన్ని నిలిపి మహిళను బలవంతంగా పక్కకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. వెంటనే బాధితురాలు ఆత్కూరు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం మహిళను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆత్కూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-01-13T13:23:10+05:30 IST