Abn logo
Oct 14 2021 @ 14:22PM

కృష్ణా జిల్లాలో దారుణం

కృష్ణా జిల్లా: అవనిగడ్డ, కోడూరులో దారుణం జరిగింది. యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పొలంలో అక్రమంగా మట్టి తరలించిన వివాదంలో బావా బావ మరుదులు ఘర్షణ పడ్డారు. శ్రావణం హరికృష్ణను చందన వెంకటేశ్వరరావు కత్తితో నరికాడు. తీవ్రంగా గాయపడిన హరికృష్ణను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.