గిరిజన కుటుంబానికి కేటీఆర్‌ చేయూత

ABN , First Publish Date - 2021-06-19T06:40:06+05:30 IST

భర్త మృతితో ఆర్థికంగా ఇక్కట్లు ఎదుర్కొంటున్న మహిళకు, ఆమె కుటుంబానికి మంత్రి కేటీఆర్‌ చేయూతనిచ్చారు.

గిరిజన కుటుంబానికి కేటీఆర్‌ చేయూత
తులసి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేస్తున్న జిల్లా అధికారులు

 ట్విట్టర్‌ పోస్టుకు స్పందించిన మంత్రి
 నిత్యావసర వస్తువుల అందజేత

చింతపల్లి, జూన 18:
భర్త మృతితో ఆర్థికంగా ఇక్కట్లు ఎదుర్కొంటున్న మహిళకు, ఆమె కుటుంబానికి మంత్రి కేటీఆర్‌ చేయూతనిచ్చారు. బాధిత మహిళ కుటుంబ ప రిస్థితిని వివరిస్తూ నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం ఎర్రమట్టితండాకు చెందిన నేనావత కిషనబానావత ఈ నెల 15వ తేదీన కేటీఆర్‌కు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎర్రమట్టితండాకు చెందిన బాణావత రవి విద్యుదాఘాతంతో 2017 ఫిబ్రవరిలో మృతి చెందాడు. రవికి భార్య తులసి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దివ్యాంగురాలైన తులసికి ఎటువంటి ఆర్థిక వనరులతో పాటు ఇల్లు కూడా లేనందున జీవనం ఇబ్బందిగా మారింది. తులసి దీన గాథను అదే గ్రామానికి చెందిన నేనావత కిషన బానావత ఈ నెల 15న ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌కు పోస్టు చేశారు. స్పందించిన కేటీఆర్‌  గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వ ప్రత్యే క కార్యదర్శి స్మితాసబర్వాల్‌కు సూచించారు. గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంతజీవనపాటిల్‌ను ఆమె ఆదేశించారు. దీంతో జిల్లా బాలల శిక్షణ కమిటీ చైర్మన కృష్ణారావు, డీసీపీవో గణేష్‌, సీడీపీవో లావణ్యకుమారి, టీడబ్ల్యూసీ సభ్యుడు కిరణ్‌లు బాణావత శుక్రవారం ఎర్రమట్టితండాకకు వెళ్లి తులసి కుటుంబాన్ని కలిసి వివరాలు తెలుసుకున్నారు. కాలుకు ఇనఫెక్షన కావడంతో రూ.2లక్ష ల అప్పులు చేసి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆపరేషన చేయించుకున్నట్లు తులసి అధికారు లకు తెలిపారు. తనకు ఇల్లు లేనందున డబుల్‌బెడ్‌రూం ఇంటిని మంజూరు చేయడం తో పాటు తన ఇద్దరు పిల్లలను గురుకుల పాఠశాలలో చేర్పించాలని తులసి కోరారు. కలెక్టర్‌ ఆదేశాలమేరకు అధికారులు రూ.2వేలు విలువ చేసే నిత్యావసర వస్తు వులను తులసికి అందజేశారు. ఆమెకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామని అధికారులు తెలిపారు. ట్విట్టర్‌  పోస్టుకు స్పందించి తు లసికి చేయూతనిచ్చినందుకు ఎర్రమట్టితండా వాసులు మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-06-19T06:40:06+05:30 IST