ముమ్మరంగా నూర్పిళ్లు

ABN , First Publish Date - 2021-01-18T06:30:32+05:30 IST

పప్పుశనగ నూర్పిళ్లు ముమ్మరంగా సాగుతున్నా యి. అకాల వర్షానికి తడిసిన పైర్ల ను కమతాల్లో ఉంచడం నిష్ప్రయోజనమ ని భావించిన రైతులు సంక్రాంతికి ముందే తొలగింపు చేపట్టారు.

ముమ్మరంగా నూర్పిళ్లు

కుంకుమ తెగులుతో తగ్గిన పప్పుశనగ దిగుబడి 

దెబ్బతీసిన అకాల వర్షాలు 

గుంతకల్లు, జనవరి 17: పప్పుశనగ నూర్పిళ్లు ముమ్మరంగా సాగుతున్నా యి. అకాల వర్షానికి తడిసిన పైర్ల ను కమతాల్లో ఉంచడం నిష్ప్రయోజనమ ని భావించిన రైతులు సంక్రాంతికి ముందే తొలగింపు చేపట్టారు. మరో పదిహేను రోజుల్లో పంట చేతికి వ స్తుందనుకున్న తరుణంలో వాతావరణం తిరగబెట్టిన కారణంగా రైతులకు రావాల్సిన దిగుబడిలో దాదాపు 30 శాతం నష్టపోయారు. ఎకరానికి 7 నుంచి 9 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనావేసుకుని మురిసిపోయిన రై తులను చివరలో వచ్చిన వర్షాలు దెబ్బతీశాయి. ఈక్రమంలో ఎకరాకు మూడు క్వింటాళ్ల మేర దిగుబడి తగ్గిపోయింది. ఈ నెల 4వ తేదీ నుంచి 6 వ తేదీ వరకూ కురిసిన ఓ మోస్త రు వర్షాలకు  పైర్లకు కుంకుమ తె గులు సోకింది. దీంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో రైతులు పంటను తొలగిస్తున్నారు. గుంతకల్లు, విడపనకల్లు, వజ్రకరూరు, ఉరవకొండ, తాడిపత్రి, యాడికి, తదితర మండలాల్లో రబీ రైతులు సోమ, మంగళవారాలలో పంట కోతలను ప్రారంభించారు. 


నష్టం పెరగకుండా ఉండటానికి..

ఈనెల మొదటి వారంలో కురిసిన వర్షాల వల్ల పప్పు శగన పైర్లకు ఉన్న పులుసు తడిసి, కారిపోవడంతో గిం జలు బలిసే అవకాశాలు లేకుండాపోయియి. పైపెచ్చు తడిసిన బుడ్డలు ఎండకాస్తే చిట్లి లోపలి గింజలు నేల పాలౌతాయన్న కారణంగా రైతులు పంటలను తొలగిం చడానికి సిద్ధమయ్యారు. పంటలను చేలల్లో ఉంచినా కాయ ఊరడానికి అనువైన వాతావరణం లేని కారణంగా నష్టం వాటిల్లుతుందన్న భయంతో రైతులు పంట కోత లకు సిద్ధపడ్డారు. దీంతో ఈ నెల 10వ తేదీ నుంచి పంట తొలగింపులు చేశారు. పంటను తొలగించిన రైతులు రెండు రోజులుగా నూర్పిడి కార్యక్రమాన్ని చేట్టారు. ఎకరా గుంటక పాయడానికి రూ. 1,500లు, యంత్రాలతో నూర్పి డి చేయడానికి ఎకరాకు రూ. 1 వెయ్యి చొప్పున చెల్లించి  రైతులు పనులను చేపట్టారు. 


ఎకరాకు నాలుగు క్వింటాళ్లే 

తొలి వర్షాలు సకాలంలో రావడం, చలి ఎక్కువగా ఉం డటంతో ఈ సంవత్సరం పప్పుశనగ పంటలు ఆశాజనకం గా కనిపించాయి. ఇంకో రెండు వారాల్లో పంటకోతలుం డగా ఎకరాకు 7 నుంచి 9 క్వింటాళ్లదాకా ఫలసాయం వస్తుందని రైతులు భావించారు. ఈ నెల 4, 5 తేదీల్లో గుంతకల్లు, పామిడి, వజ్రకరూరు మండలాలు, 5, 6 తే దీల్లో ఉరవకొండ, అనంతపురం, కళ్యాణదుర్గం, రాయ దుర్గం, శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో వర్షాలు కురిశాయి. తాడిపత్రి నియోజకవర్గంలో అక్టోబరులో కురిసిన భారీ వర్షాల వల్ల తెగుళ్లు ఆశించి దెబ్బతిన్న పం టలు, ఈ చివరి వర్షాల కారణంగా మరింత అధ్వానంగా తయారయ్యా యి. ఇతర మండలాల్లోనూ రావాల్సిన దిగుబడి రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. 


పెట్టుబడి వస్తుందన్న నమ్మకం లేదు

30 ఎకరాల్లో పప్పుశనగ పంట పెట్టా. ఎకరాకు ఏడు క్వింటాళ్ల చొప్పున 200 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అ నుకున్నా. కానీ వర్షం కారణంగా పదిహేను రోజుల ముం దుగానే పంటను తొలగించాల్సి వచ్చింది. దీంతో దిగుబడి సగానికి పడిపోయింది. పెట్టుబడి వస్తుందన్న న మ్మక మూ లేకుండాపోయింది. 

-  మోహన్‌, జీ కొట్టాల రైతు


పంట తొలగించకుంటే నష్టం పెరుగుతుంది 

బుడ్డలు తడిసి పగులుతున్నాయి. దీంతో లోపల ఉన్న గింజలు నల్లబారి పోతున్నాయి. ఇప్పటికే పప్పుశనగ కట్టె నల్లబడిపోతోంది. ఇక గింజల ఔటన్‌ పెరిగే అవకాశం లేదు. కనుక వెంటనే పంటలను తొలగించకపోతే రైతుకు నష్టమేతప్ప ప్రయోజనం లేదు.

- తిరుమల రావు, పప్పుశనగ రైతు


రెండు రోజుల్లో తొలగిస్తా

ఐదెకరాల్లో పప్పుశనగ పంట వేశా. ఎకరాకు 8 క్విం టాళ్ల దిగుబడి వస్తుందనుకున్నా. కానీ వర్షాల కారణంగా ఫలసాయం 5 క్విం టాళ్లకు పడిపోయింది. వెసులుబాటు చూసుకుని రెండు రోజుల్లో పంటను తొలగించాలని అనుకుంటున్నా.

- ఎం వెంకటేశులు, పప్పుశనగ రైతు


ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి 

వర్షాలు వచ్చినా నా కమతంలో పప్పుశనగ పైరుకు కుంకుమ తెగులు సోకలేదు. దీంతో ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నూర్పిడి కార్యక్రమాన్ని చేపట్టా. 

-  సుంకన్న, గుంతకల్లు రైతు


Updated Date - 2021-01-18T06:30:32+05:30 IST