Advertisement
Advertisement
Abn logo
Advertisement

కర్నూలు ఎస్పీకి లోకేష్ లేఖ

కర్నూలు: జిల్లాలోని కల్లూరు మండలం మార్కాపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త రామాంజనేయులు పట్ల పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ జిల్లా ఎస్పీకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  లోకేష్ లేఖ రాశారు. స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకే టీడీపీ కార్యకర్త రామాంజనేయులు పట్ల పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పోలీసు స్టేషన్లలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల గురించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు ఈ ఘటన అద్దంపడుతోందన్నారు. ఒక సాధారణ కుటుంబాన్ని దురుద్దేశమే లక్ష్యంగా చేసుకొని పోలీసులు వేధించటం సరికాదన్నారు. పోలీసులు పెట్టే తప్పుడు కేసులు ఎదుర్కోవడం సామాన్యులకు శిక్షగా మారుతోందని తెలిపారు. వైసీపీప్రయోజనాల కోసం పోలీసులు అసలు విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. బెయిల్‌కు అవకాశం లేని సెక్షన్లు నమోదు చేయడం, కుటుంబాలను బెదిరించడం,  జీవనోపాధి దెబ్బతీయడం కోసం పోలీసులు పనిచేయటం సరికాదన్నారు. కొందరు పోలీసులు తమ ప్రాథమిక విధులు నిర్వహించడంలో విఫలమవుతూ అధికారంలో ఉన్నవారి చేతిలో సాధనంగా మారుతున్నారని అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడినవారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే ప్రజాక్షేత్రంలోనే తప్పులు ఎండగడతామన్నారు. మనమంతా రాజ్యాంగానికి సమాధానం చెప్పాలి కానీ అధికార పార్టీ నాయకులకు కాదని గుర్తించాలని లోకేష్ లేఖలో పేర్కొన్నారు. 

Advertisement
Advertisement