చెప్పినట్లు వినకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తానని.. బెదిరిస్తుండడంతో..

ABN , First Publish Date - 2020-08-15T18:22:56+05:30 IST

మండలానికి చెందిన ఓ సంఘమిత్రను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్న..

చెప్పినట్లు వినకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తానని.. బెదిరిస్తుండడంతో..

సంఘమిత్రపై వెలుగు సీసీ లైంగిక వేధింపులు

పోలీసులకు ఫిర్యాదు

కేసు నమోదు 


కేవీపల్లె(చిత్తూరు): మండలానికి చెందిన ఓ సంఘమిత్రను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్న వెలుగు సీసీపై కేసు నమోదైంది. బాధితురాలి కథనం మేరకు.. మండలానికి చెందిన ఓ మహిళ 12 సంవత్సరాలుగా సంఘమిత్రగా పనిచేస్తోంది. రెండేళ్ల క్రితం ఆమె పనిచేసే గ్యారంపల్లె క్లస్టర్‌కు మధుసూదన్‌రెడ్డి వెలుగు సీసీగా వచ్చాడు. ఏడాదిగా ఆమెను వేధించేవాడు.


చెప్పినట్లు వినకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరించే వాడు. కార్యాలయంలో ఒంటరిగా ఉన్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆమె ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఏపీఎంకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీంతో అతడు మరించి రెచ్చిపోయాడు. తప్పుడు రికార్డులు సృష్టించి కేసులు పెట్టిస్తానని, తనకు అధికార పార్టీ నాయకుల అండ ఉందని బెదిరింపులకు పాల్పడేవాడు. ఈ క్రమంలో ఆమె మరోసారి ఏరియా కో-ఆర్డినేటరకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో ఎలాంటి హామీ తలపెట్టబోనని సీసీ హామీ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ మామూలే.


బాధితురాలి గ్రామానికి చెందిన అగ్రవర్ణాల యువకులకు మద్యం తీసిచ్చి వారితో బెదిరింపులకు పాల్పడేవాడు. పదినెలలుగా జీతం ఇవ్వడంలేదు. తన గదికి వస్తే ఇస్తానంటూ అసభ్యంగా మాట్లాడేవాడు. దీనిపై పోలీసులు వెంటనే స్పందించారు. ఏపీఎం సుధాకర్‌రెడ్డితోపాటు పలువురు మండల సమాఖ్య సిబ్బందిని  విచారించారు.  మధుసూదన్‌ రెడ్డిపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామ్మోహన్‌ తెలిపారు. 


Updated Date - 2020-08-15T18:22:56+05:30 IST