Abn logo
May 30 2020 @ 13:02PM

ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితా నుంచి అందాల తార అవుట్!

న్యూయార్క్: ఫోర్బ్స్ మేగజైన్ బిలియనీర్ల జాబితా నుంచి అమెరికన్ టీవీ రియాలిటీ స్టార్ కెయిలీ జెన్నర్ స్థానం కోల్పోయింది. ‘‘స్వయంకృషితో ఎదిగిన యువ బిలియనీర్‌’’గా గతేడాది గుర్తింపు పొందిన సదరు అందాల తార తాజాగా ఫోర్బ్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. కెయిలీ కుటుంబం ‘‘అబద్ధాల గూడు’’ అల్లుతోందనీ.. 22 ఏళ్ల ఆమె తన వ్యాపారాన్నీ, విజయాలను పెంచి చూపించారని ఫోర్బ్స్ ఆరోపించింది. ఆమె సంపద కేవలం 900 మిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నట్టు తమ రివ్యూలో తేలిందని ఫోర్బ్స్ తెలిపింది.


అయితే ఫోర్బ్స్ ఆరోపణలను కెయిలీ కొట్టిపారేసింది. ఫోర్బ్స్ పేరెత్తకుండా పరోక్షంగా వరుస ట్వీట్లతో విరుచుకుపడింది. ‘‘ఇప్పుడు నా దగ్గర ఇంత డబ్బుంది అని నిర్ణయించడం కంటే ముఖ్యమైన 100 విషయాల జాబితా నేను చెప్పగలను..’’ అని పేర్కొంది. ఫోర్బ్స్ చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలేననీ... వాటికి ఎలాంటి ఆధారాలూ లేవని ఆమె పేర్కొంది. తానెప్పుడూ పేరు కోసం పాకులాడలేదనీ.. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కూడా తనకు రాలేదని అమె చెప్పుకొచ్చింది. 



Advertisement
Advertisement
Advertisement