రోగి సహాయకురాలితో ల్యాబ్‌ టెక్నీషియన్‌ అసభ్య ప్రవర్తన

ABN , First Publish Date - 2021-06-27T14:13:38+05:30 IST

చూపిస్తానంటూ రవితేజ రెండో అంతస్తునుంచి ర్యాంప్‌ మార్గంలో...

రోగి సహాయకురాలితో ల్యాబ్‌ టెక్నీషియన్‌ అసభ్య ప్రవర్తన

హైదరాబాద్ సిటీ/పహాడీ షరీఫ్‌ : పేట్ల బుర్జు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి సహాయకురాలిపై ల్యాబ్‌ టెక్నీషియన్‌ అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన చార్మినార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చార్మినార్‌ ఇన్‌స్పెక్టర్‌ గురువానాయుడు తెలిపిన వివరాల ప్రకారం  ఓ మహిళా రోగికి సహాయకురాలిగా ఈనెల 24వ తేదీన బాధితురాలు పేట్లబుర్జు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి వచ్చింది. రెండో అంతస్తునుంచి గ్రౌండ్‌ ఫ్లోర్‌కి వెళ్లే మార్గానికి ఎలా వెళ్తారని ఆస్పత్రి బ్లడ్‌బ్యాంక్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్‌ (కాంట్రాక్ట్‌ ఉద్యోగి)గా పని చేస్తున్న రవితేజ (27)ను బాధితురాలు అడిగింది. చూపిస్తానంటూ రవితేజ రెండో అంతస్తునుంచి ర్యాంప్‌ మార్గంలో మొదటి అంతస్తుకు తీసుకువచ్చాడు. అక్కడికి చేరుకోగానే ఆమెతో రవితేజ అసభ్యకరంగా ప్రవర్తించాడు. చివరికి అతని నుంచి తప్పించుకుని జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేసింది. శుక్రవారం అర్ధరాత్రి ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు చార్మినార్‌ పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు.

Updated Date - 2021-06-27T14:13:38+05:30 IST