ఏసీబీకి చిక్కిన వీఆర్వో

ABN , First Publish Date - 2021-10-22T05:04:30+05:30 IST

లంచం తీసుకుంటూ శంఖవరం-1 వీఆర్వో గురువారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆ మేరకు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి వివరాలను వెల్లడించారు. పట్టణ సమీపంలోని శంఖవరంలో 45 సెంట్లు భూమి మ్యుటేషన్‌ కోసం వీఆర్వో మాలకొండేశ్వరరావు రూ.10వేలు లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో సదరు బాధితుడు ముత్తుముల మహేష్‌ రూ.5వేలకు ఒప్పించాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీకి సమాచారం అందించాడు.

ఏసీబీకి చిక్కిన వీఆర్వో
లంచం తీసుకుంటుండా పట్టుబడ్డ వీఆర్వో మాలకొండేశ్వరరావు

 మ్యుటేషన్‌ కోసం రూ.10వేలు డిమాండ్‌ 

రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత

కనిగిరి, అక్టోబరు 21 : లంచం తీసుకుంటూ శంఖవరం-1 వీఆర్వో గురువారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆ మేరకు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి వివరాలను వెల్లడించారు. పట్టణ సమీపంలోని శంఖవరంలో 45 సెంట్లు భూమి మ్యుటేషన్‌ కోసం వీఆర్వో మాలకొండేశ్వరరావు రూ.10వేలు లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో సదరు బాధితుడు ముత్తుముల మహేష్‌ రూ.5వేలకు ఒప్పించాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీకి సమాచారం అందించాడు. వారి సూచన మేరకు వీఆర్వోకు మహేష్‌ లంచం ఇస్తుండగా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల వద్ద ఏసీబీ అధికారులు మాటువేసి రెడ్‌హ్యాండెడ్‌గా  పట్టుకున్నారు. పేద కుటుంబానికి చెందిన మహేష్‌ ఎలక్ర్టీషియన్‌గా రోజువారి పని చేస్తుంటాడు. మూడు నెలల నుంచి ఈ పని మీద ఎన్నోమార్లు వీఆర్వో చుట్టూ మహేష్‌ తండ్రి తిరిగాడు. ఎంతకీ పనిచేయకపోవడంతో ఆయన విసిగిపోయి డబ్బులు ఇచ్చే స్థోమత లేక తన కుమారుడు మహేష్‌కు జరిగినదంతా చెప్పాడు. దీంతో వారం క్రితం మహేష్‌ వీఆర్వోను కలిసి మాట్లాడగా లంచం ఇస్తేనే పని పూర్తిచేస్తానని తేల్చిచెప్పాడు. ఈక్రమంలోనే మహేష్‌ ఏసీబీని ఆశ్రయించాడు. ఆ మేరకు అధికారులు వీఆర్వోను పట్టుకుని రూ.5వేలును రికవరీ చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఆయన వెంట ఏసీబీ ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, శేషు, అపర్ణలు ఉన్నారు. 


Updated Date - 2021-10-22T05:04:30+05:30 IST