Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరకట్నం తేలేదని భర్త లైంగికంగా వేధిస్తున్నాడంటూ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు.. అసలు అతను ఏం చేసేవాడంటే..

రాజస్థాన్‌లోని చురు నగరంలో 28 ఏళ్ల మహిళా పోలీస్ కానిస్టేబుల్ తన భర్త వరకట్నం కోసం లైంగికంగా వేధిస్తున్నాడంటూ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భర్తతో సహా మరో 9 మందిని ఫిర్యాదులో పేర్కొంది.  తన భర్త పెదనాన్న కూడా తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు విచారణ మొదలు పెట్టారు.


పోలీసుల కథనం ప్రకారం 2019లో పోలీస్ కానిస్టేబుల్ స్వప్న(పేరు మార్చబడినది)కు  రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలోని ఒక గ్రామంలో వివాహమైంది. వివాహమైన అతికొద్ది సమయం తర్వాత నుంచే అత్తవారు వరకట్నం కావాలని వేధింపులు మొదలుపెట్టారు. వేధింపులు తాళలేక ఆమె రూ.4.5 లక్షలు వారికి ఇచ్చింది. కానీ వారు ఇంతటితో ఆగలేదు. ఇంకా కట్నం కావాలని డిమాండ్ చేశారు. ఈ సారి 10 లక్షలు, ఒక కారు కావాలని అడిగారు. ఇవ్వపోవడంతో ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించేవారు.


ఆమె ఇదంతా పుట్టింటివారికి చెప్పినా వారు ఏమిచేయలేమని చెప్పారు. అత్తవారింటికి వెళ్లగానే అత్త, మామ, భర్త పెదనాన్న స్వప్నను బూతులు తిట్టేవారు. "నువ్వు పోలీసు ఉద్యోగం చేసి లంచాలు తీసుకొని మాకు కట్నం తీసుకొని రా, ఆ మాత్రం లేకపోతే నీ ఉద్యోగం ఎందుకు" అనేవారు అని స్వప్న వాపోయింది. తాను 10 లక్షలు తీసుకువస్తే ఆ డబ్బులతో పెళ్లికి చేసిన అప్పు తీర్చి, భర్తతో వ్యాపారం పెట్టిస్తామని చెప్పేవారు అని స్వప్న చెప్పింది.


స్వప్న కట్నం తేలేక పోయేసరికి ఆమె భర్త తనతో క్రూరంగా వ్యవహరించడం మొదలు పెట్టాడని, బలవంతంగా తనతో వెనుక నుంచి సెక్స్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఇది రోజూ చేసేవాడని, తను ఎదురు తిరిగితే ఎలా పడితే అలా కొట్టేవాడని చెప్పింది.  స్వప్న డ్యూటీలో పరాయి మగాళ్లతో సంబంధం పెట్టుకుందని తన భర్తే నలుగురిలో ఆమెపై నిందలు వేశాడని, తన భర్త పెదనాన్న చాలా సార్లు తన గదిలో వచ్చి అసభ్యకరంగా మాట్లాడేవాడని ఆమె చెప్పింది. ఒకరోజు స్వప్న వంటగదిలో ఉండగా వెనుక నుంచి వచ్చి గట్టిగా పట్టుకొని తన కోరిక తీర్చమంటూ తనపై అత్యాచారం చేయబోయాడని ఆమె అన్నది.


ఇక ఈ హింసలు భరించలేనని భావించిన స్వప్న భర్త ఇల్లు వదిలేసి, ప్రభుత్వ పోలీస్ నివాసం(క్వార్టర్స్)లోకి వచ్చేసింది. ఇప్పుడు తన భర్త తిరిగి ఇంటికి రాకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడని చెప్పడంతో స్వప్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రస్తుతం వరకట్న వేధింపులు, అత్యాచార యత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement