Abn logo
Aug 3 2021 @ 23:56PM

రైతులందరికీ లక్ష రూపాయల రుణమాఫీ చేయాలి

కిసాన్‌ మోర్చా సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి మహిపాల్‌రెడ్డి

ఆదిలాబాద్‌, ఆగస్టు3 (ఆంధ్రజ్యోతి): అర్హులైన రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేయాలని బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యదర్శి మహిపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కిసాన్‌మోర్చా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ 2018 ఎన్నికల మెనిఫెస్టోలో పేర్కొన్న లక్ష రూపాయల రుణమాఫీని ఇంత వరకు అమ లు చేయలేదన్నారు. కేవలం నామమాత్రంగానే రుణమాఫీ చేస్తూ తప్పించుకుంటుందన్నారు. త్వరలో జరుగనున్న హుజరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా మళ్లీ రూ.50వేల రుణమాఫీ ప్రకటించడం జరిగిందన్నారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రజల ఆదరణ పెరుగుతుందన్న ఉద్దేశ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదన్నారు. దేశంలోని సుమారుగా అన్ని రాష్ర్టాల్లో ఫసల్‌భీమాయోజన, కిసాన్‌ సమ్మన్‌ యోజన లాంటి పథకాలు అమలవుతున్న కేసీఆర్‌ ప్రభుత్వం మాత్రం అమలు చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు. ఫసల్‌ భీమా కింద కేంద్ర ప్రభుత్వం తనవాటాను చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వ మాత్రం కొర్రీలు పెడుతూ రైతులను మోసం చేస్తుందన్నారు. ఇందులో  కిసాన్‌మోర్చ జిల్లా అధ్యక్షుడు దయాకర్‌ పలు మండలాల కార్యదర్శులు, అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. 

జైనథ్‌: కిసాన్‌మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా మండలంలోని దీపాయిగూడ గ్రామానికి చెందిన రజనాల భూమన్న మంగళవారం నియమితులయ్యారు. మంగళవారం మండలంలోని దీపాయిగూడ గ్రామంలోని పార్టీ కార్యాలయంలో ఆయనను బీజేపీ జిల్లా అధికారి ప్రతినిధి లోక ప్రవీణ్‌రెడ్డి, నాయకులు ఘనంగా న్మానించారు.