Advertisement
Advertisement
Abn logo
Advertisement

తన స్థలంలో మూత్రం పోశారని.. సోదరుడి కొడుకులపై ఘాతుకం.. తుపాకీ తీసుకొచ్చి..

వాళ్లిద్దరూ రక్తం పంచుకుపుట్టిన సోదరులు.. ఇద్దరి మధ్య భూమి విషయమై వివాదం తలెత్తింది.. స్థల వివాదం విషయంలో ఇద్దరూ కోర్టుకు వెళ్లారు.. సోమవారం ఉదయం ఆ వివాదాస్పద స్థలం గురించి మరోసారి గొడవ జరిగింది.. ఈ ఘటనలో ఇద్దరూ సోదరులు హోరాహోరీ తలపడ్డారు.. ఫలితంగా ఒక సోదరుడి కుమారుడు ప్రాణం కోల్పోయాడు..  మరో కుమారుడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగరాజ్‌లో ఈ ఘటన జరిగింది. 


ప్రయోగరాజ్‌కు చెందిన దినేష్ శుక్లా, నీలూ శుక్లా అనే సోదరుల మధ్య  ఓ స్థలం విషయంలో చాలా రోజుల కిందట వివాదం నెలకొంది. ఆ స్థలం తనదంటే తనదని సోదరులిద్దరూ కోర్టుకు వెళ్లారు. సోమవారం ఉదయం ఆ వివాదాస్పద స్థలంలో దినేష్ శుక్లా పిల్లలు దీపక్ శుక్లా, వైభవ్ శుక్లా మూత్ర విసర్జన చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన నీలూ శుక్లా గొడవకు దిగాడు. ఇరు వైపుల వాళ్లు కత్తులు, కర్రలు తీసుకుని బయల్దేరారు. 


ఆ గొడవలో ఆగ్రహానికి గురైన నీలూ శుక్లా సోదరుడి పిల్లలపై కాల్పులు జరిపాడు. దీపక్ శుక్లా, వైభవ్‌ శుక్లా ఆ కాల్పుల కారణంగా నేలకొరిగారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే దీపక్ చనిపోగా.. వైభవ్ ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రస్తుతం వైభవ్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. హత్యకు పాల్పడిన నీలూ శుక్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement