Advertisement
Advertisement
Abn logo
Advertisement

భూమిని, రైతును కాపాడుకోవాలి

ప్రజా పోరాటాల వల్లే కొంతైనా న్యాయం

అక్రమ కేసులతో ప్రజా ఉద్యమాలను అణచలేరు

అమరవీరుల సంస్మరణ సభలో ప్రజాగాయని విమలక్క

రాజమహేంద్రవరం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): భూమిని, రైతును కాపాడు కోవాలి. రసాయన ఎరువుల కంపెనీలకు లైసెన్సులు ఇస్తూ, హైబ్రీడ్‌ విత్తనాలు మా త్రమే వేసుకోవాలని ఒత్తిడి చేస్తూ భూసారాన్ని దెబ్బతీస్తున్నారు. వాళ్లు ఇచ్చిన విత్త నాలే వాడాలి. అది మళ్లీ రైతువారీ విత్తనంగా పనిచేయదు. పైగా రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కూడా ఇవ్వడంలేదు. ఈ విధానం మారాలి. రైతే తమ పంటకు ధర నిర్ణయించే పరిస్థితులు ఉండాలని ప్రముఖ ప్రజాగాయని, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జాతీయనాయకురాలు విమలక్క స్పష్టం చేశారు. స్థానిక  విక్రమహాల్‌లో రైతుకూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి. రమేష్‌ అధ్యక్షతన మంగళవారం జరిగిన చండ్ర పుల్లారెడ్డి 37వ వర్ధంతి, అమరవీరుల సంస్మరణ సభలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రజా పోరాటాల వల్లే కొంతైనా న్యాయం జరు గుతోంది. శ్రీకాకుళం పోరాటాలు, తెలంగాణ రైతాంగ ఉద్యమాల వల్ల చాలా మార్పు వచ్చింది. అమరవీరుల త్యాగాల స్ఫూర్తిని కొనసాగించాలి. అడవులు, ఆదివాసీలు ఉంటేనే మనం బాగుంటాం. అడవులు, అక్కడి ఖనిజ సంపద దోపిడికి వ్యతిరేకంగా పోరాడాలని ఆమె పిలుపు ఇచ్చారు. ప్రముఖ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ  దేశంలో  ఆదివాసీలు, దళితులు మైనార్టీలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ ఉత్తర భారత రైతాంగ ఉద్యమ తీవ్రతకు  మోదీ మోకరిల్లక తప్పలేదన్నారు.  రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నంబి నరసింహయ్య మాట్లాడుతూ భూమి, భుక్తి విముక్తితోనే ప్రజలకు నిజమైన స్వాతంత్య్రమన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి సతీష్‌, జిల్లా నేతలు వల్లూరి రాజబాబు, బసవయ్య, కె.వేంకటేశ్వర్లు, ఆర్‌. సతీష్‌, పెరుగుల దివ్య, డాన్‌ శ్రీను, సురేష్‌, సత్యం, అన్నవరం, సత్తిరాజు తదిత రులు పాల్గొన్నారు. అంతకుముందు విమలక్క ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు.Advertisement
Advertisement