పోడు భూముల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-12-01T03:39:18+05:30 IST

దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లోని పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం నాయకులు మంగళవారం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావుకు వినతిపత్రం అందించారు. అంతకుముందు ఐబీ చౌరస్తా నుంచి ఎమ్మెల్యే నివాసం వరకు ర్యాలీగా వెళ్లారు.

పోడు భూముల సమస్యలు పరిష్కరించాలి
ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇస్తున్న సీపీఎం నాయకులు

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 30: దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లోని పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం నాయకులు మంగళవారం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావుకు వినతిపత్రం అందించారు. అంతకుముందు ఐబీ చౌరస్తా నుంచి ఎమ్మెల్యే నివాసం వరకు ర్యాలీగా వెళ్లారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు శనిగరపు అశోక్‌, దుంపల రం జిత్‌కుమార్‌లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోడు సాగు దారులకు హక్కు పత్రాల కోసం షెడ్యూలు ప్రకటించిందని, కానీ జిల్లా అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిం చడం వల్ల పలు గ్రామాలను పోడు గ్రామాల జాబితాలో చేర్చలేదన్నారు. దీంతో అనేక మంది పోడు రైతులకు అన్యా యం జరుగుతుందన్నారు. దండేపల్లి మండలంలోని మామిడి పల్లి, లింగాపూర్‌, దమ్మన్నపేట, మామిడిగూడ, మాకులపేట, కోయపోచంగూడ, గుడిరేవు, తాళ్లపేట్‌, బిక్కానాగూడెం గ్రామా లను పోడు జాబితాలో చేర్చాలన్నారు. అర్హులైన పోడు రైతు లను గుర్తించి హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. రాంజీ, తారా బాయి, లక్ష్మీ, రాజమౌళి, రాజన్న, అంజన్న, రాజు, రమేష్‌,  భూమయ్య, ఎల్లయ్య, పటేల్‌, నర్సయ్య, చిన్నా పాల్గొన్నారు. 

నెన్నెల: కుశ్నపల్లి శివారు పోడు భూముల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. సర్వే నంబరు 57లో సాగుకు వెళ్ళిన గిరిజన రైతులను ఫారెస్టు అధికారులు అడ్డుకున్న విషయం తెలుసు కున్న ఎమ్మెల్యే మంగళవారం గ్రామానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. రిజర్వు ఫారెస్టు పేరిట తమను అధికారులు అడ్డుకుంటున్నారని రైతులు చెప్పారు.

 కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. రేంజ్‌ అధికారి గోవిం ద్‌చంద్‌ సర్దార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్య ను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే సూచిం చారు. ఉన్నతాధికారులతో చర్చించి రెవెన్యూ, ఫారెస్టు జాయిం ట్‌  సర్వే జరిపిస్తామన్నారు.  ఏ శాఖకు చెందిన భూములో తేలేవరకు రైతులు అధికారులకు సహకరించాలని కోరారు. సమస్య పరిష్కారం కాకుంటే రైతుల పక్షాన పోరాటం చేస్తా నని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలను అధికారు లతో మాట్లాడి కొలిక్కి తీసుకొచ్చామన్నారు. ఎమ్మెల్యే వెంట  మండల కోఆప్షన్‌ సభ్యులు ఎండీ ఇబ్రహీం, సర్పంచ్‌ సంధ్యమహేష్‌ తదితరులున్నారు.  

Updated Date - 2021-12-01T03:39:18+05:30 IST