Abn logo
Oct 22 2021 @ 00:23AM

భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

- కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): అటవీ, రెవెన్యూ భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. గురువారం సమీకృత కలెక్టరేట్‌ సముదాయంలో రెవెన్యూ, అటవీ అధికారులతో భూ సమస్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒరిజినల్‌ రెవెన్యూ  రికార్డుల మేరకు సర్వే చేపట్టాలని, తహసీల్దార్‌, అటవీ రేంజ్‌ అధికారులు సమన్వయంతో పరిశీలించాలని అన్నారు. జిల్లాలోని వీర్నపల్లి మండలం రంగంపేట, చందుర్తి మండలంలో బండలింగంపల్లి, చందుర్తి, తిమ్మాపూర్‌, సనుగుల, ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌, కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామాల్లో అటవీ రెవెన్యూ సరిహద్దులు వంటి సమస్యలు ఉన్నట్లు తెలిపారు.  అటవీ భూములు దురాక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆర్‌వోఎఫ్‌ఆర్‌ సమస్యలను ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిష్కరించాలన్నారు. ఖాళీగా ఉన్న అటవీ భూముల్లో హరితహారం కింద మొక్కలు నాటాలని సూచించారు. జిల్లాలో అటవీ వీస్తీర్ణం పెంపునకు చర్యలు తీసుకోవాలని, సమస్యల పరిష్కారానికి నెలవారీ సమీక్షలు నిర్వహించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఇన్‌చార్జి డీఆర్వో శ్రీనివాసరావు, జిల్లా అటవీ అధికారి బాలమణి, ఆర్‌అండ్‌బీ ఈఈ కిషన్‌రావు, డీఆర్డీవో కౌటిల్యరెడ్డి, ప్యాకేజీ 9 ఈఈ శ్రీనివాస్‌, సిరిసిల్ల ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాస్‌, వేములవాడ అధికారి ఎల్లయ్య, తహసీల్దార్లు మజీద్‌, తఫాజుల్‌హుస్సేన్‌, నరేష్‌, నరేందర్‌ పాల్గొన్నారు.