భాషా వలంటీర్లను తక్షణమే రెన్యువల్‌ చేయాలి

ABN , First Publish Date - 2022-01-29T05:00:57+05:30 IST

విశాఖ మన్యంలో గిరిజన అక్షరాస్యత పెరగడానికి కృషి చేస్తున్న ఆదివాసీ భాషా వలంటీర్‌లను తక్షణమే రెన్యువల్‌ చేయాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతి డిమాండ్‌ చేశారు.

భాషా వలంటీర్లను తక్షణమే రెన్యువల్‌ చేయాలి
పాడేరులో భాషా వలంటీర్ల దీక్షలకు మద్దతు తెలిపిన ప్రభావతి, తదితరులు


ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతి డిమాండ్‌

పాడేరురూరల్‌, జనవరి 28: విశాఖ మన్యంలో గిరిజన అక్షరాస్యత పెరగడానికి కృషి చేస్తున్న ఆదివాసీ భాషా వలంటీర్‌లను తక్షణమే రెన్యువల్‌ చేయాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతి డిమాండ్‌ చేశారు. ఐటీడీఏ వద్ద భాషా వలంటీర్లు చేపట్టిన రిలే దీక్షల శిబిరాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తెలుసుకొని వారికి మద్దతు పలికారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతంలో విద్యాప్రమాణాల మెరుగుకు సీతంపేట ఐటీడీఏలో 150 మందిని, కేఆర్‌.పురం ఐటీడీఏలో వంద మంది మాతృ భాష వలంటీర్‌లను అక్కడ అధికారులు రెన్యువల్‌ చేశారన్నారు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని వలంటీర్‌లను తక్షణమే రెన్యువల్‌ చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో భాషా వలంటీర్‌ల జిల్లా గౌరవాధ్యక్షులు కె.నర్సయ్య, పి.కుమారి, కె.సర్బునాయుడు, సత్యవతి, చిన్నారావు, చిన్న, నరసింగరావు పాల్గొన్నారు.


 

Updated Date - 2022-01-29T05:00:57+05:30 IST