జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో తాజా అప్‌డేట్

ABN , First Publish Date - 2020-10-30T01:13:38+05:30 IST

జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణను సీబీఐ కోర్టు నవంబర్‌ 2కు వాయిదా వేసింది. ముందు తమ కేసుల విచారణ చేపట్టాలన్న...

జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో తాజా అప్‌డేట్

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నవంబర్ 2కు వాయిదా

అమరావతి: జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణను సీబీఐ కోర్టు నవంబర్‌ 2కు వాయిదా వేసింది. ముందు తమ కేసుల విచారణ చేపట్టాలన్న ఈడీ అభ్యర్థనపై వాదనలు జరిగాయి. సీబీఐ కేసు తేలిన తర్వాత లేదా ఒకేసారి విచారణ జరపాలని జగన్‌ తరపు న్యాయవాది కోరారు. ఈడీ కేసులు ముందుగా విచారణ జరపవద్దని పిటిషన్లు దాఖలు చేశారు. జగన్‌, విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌ తరపున ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ కేసు విచారణను సీబీఐ కోర్టు నవంబర్‌ 3కు వాయిదా వేసింది.


గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ స్కాం కేసు విచారణ నవంబర్‌ 2కు వాయిదా వేసింది. ఓఎంసీ కేసు విచారణ వాయిదా వేయాలన్న అలీఖాన్‌ పిటిషన్‌‌ను సీబీఐ కోర్టు కొట్టేసింది. కరోనా టీకా వచ్చే వరకు లేదా జనవరి వరకు విచారణ ఆపాలని అలీఖాన్ పిటిషన్‌లో కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో విచారణ ఆపవద్దని సీబీఐ.. కోర్టును కోరింది. దీంతో.. గాలి జనార్ధన్ రెడ్డి పీఏ అలీఖాన్‌ అభ్యర్థనను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది.

Updated Date - 2020-10-30T01:13:38+05:30 IST