వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2021-09-17T13:55:39+05:30 IST

వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో..

వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ ప్రారంభం

వినుకొండటౌన్‌: వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో 17 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వ హించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలి పారు. స్థానిక నరసరావుపేట రోడ్డులోని వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలందరికి మెరుగైన వైద్యసౌకర్యం అందించాలన్నదే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఇప్పటికే నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాలయాలతోపాటు వైద్యశాలల్లో మౌలిక వసతులు తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. మొత్తం వినుకొండలో పట్టణ జనాభా ప్రాతిపదికన 4 హెల్త్‌సెంటర్లు మంజూరయ్యాయని, ఇప్పటికే హనుమాన్‌నగర్‌లో ఒకటి, మరొకటి ఎన్‌ఎస్‌పీ కాలనీ ఆవరణలో నేడు ప్రారంభించుకోవడం జరిగిందని, త్వరలో మరో రెండు సెంటర్లను ఏర్పాటు చేస్తామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ దస్తగిరి, వైస్‌ చైర్‌పర్సన్‌లు రాజేష్‌ఖన్నా, బేతం గాబ్రియేలు, మార్కెట్‌యార్డు చైర్‌పర్సన్‌ గంధం బాలిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ బి.శ్రీనివాసులు, వైద్యాధికారులు డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి, డాక్టర్‌ రజాక్‌, గాయత్రి, భాస్కర్‌, సౌమ్యతో పాటు కౌన్సిలర్లు ఎం.ఎల్‌.రెడ్డి, బ్రహ్మయ్య, ఇందుమతి, ఎంఎస్‌కే బాషా, వైసీపీ నాయకులు ములకా రామతులసిరెడ్డి, ఎం.ఎన్‌.ప్రసాద్‌, చిన్నబ్బాయి, కల్యాణ్‌, నరసింహారావు, రామిరెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-09-17T13:55:39+05:30 IST