వైద్యుల రక్షణకు చట్టాలు తేవాలి

ABN , First Publish Date - 2021-06-19T05:04:14+05:30 IST

కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి వైద్య సేవ లు అందిస్తున్న వైద్యులపై జరుగుతున్న దాడులను అరిక ట్టేందుకు వెంటనే చట్టాలు తేవాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రొద్దుటూరు శాఖ కార్యదర్శి హరీ్‌షకుమార్‌ ప్రభుత్వాన్ని కోరారు.

వైద్యుల రక్షణకు చట్టాలు తేవాలి
నిరసన తెలియజేస్తున్న ప్రైవేట్‌ వైద్యులు

 నిరసన దినంలో ఐఎంఏ కార్యదర్శి డాక్టర్‌ హరీ్‌షకుమార్‌

ప్రొద్దుటూరు క్రైం, జూన్‌ 18 : కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి వైద్య సేవ లు అందిస్తున్న వైద్యులపై జరుగుతున్న దాడులను అరిక ట్టేందుకు వెంటనే చట్టాలు తేవాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రొద్దుటూరు శాఖ కార్యదర్శి హరీ్‌షకుమార్‌ ప్రభుత్వాన్ని కోరారు. అనుకోని పరిస్థితుల్లో రోగి చనిపోతే, దానికి వైద్యున్ని బాధ్యుడ్ని చేస్తూ దాడు లు చేయడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం వైద్యుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను తేవాలని ఆయన కోరారు. ఈ మేరకు ఇంటియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వైద్యులపై జరిగిన దాడులకు నిరసనగా ఇక్కడి ప్రైవేట్‌ వైద్యులు జాతీయ నిరసన దినాన్ని పాటించి నల్లబ్యాడ్జీలతోనే వైద్యసేవలను అందించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ హరీ్‌షకుమార్‌ మాట్లాడుతూ కొవిడ్‌ వైద్యసేవలు అందిస్తూ అసువులు బాసిన వైద్యులను అమరవీరులుగా గుర్తించి వారి కుటుంబానికి పీఎం గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీ కింద రూ.కోటి ఆర్థికసాయం ప్రకటించాలన్నారు.  కాగా పట్టణంలోని ప్రైవేట్‌ వైద్యులు తమ క్లినిక్‌ల్లోనే నిరసన తెలియజేస్తూ వైద్యసేవలు అందించారు. 

Updated Date - 2021-06-19T05:04:14+05:30 IST