ఎదురు పడినా ఆపని ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్‌ కార్లు.. కొరవడిన సఖ్యత..

ABN , First Publish Date - 2020-08-13T18:02:14+05:30 IST

చేపల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జడ్పీచైర్మన్‌ ఎలిమినేటి సం దీ్‌పరెడ్డి అన్నారు

ఎదురు పడినా ఆపని ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్‌ కార్లు.. కొరవడిన సఖ్యత..

మత్స్యకారుల సంక్షేమానికి పెద్ద పీట

జడ్పీచైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి 

బీబీనగర్‌ పెద్దచెరువులో చేపపిల్లల పంపిణీ 

కార్యక్రమంలో నేతల మధ్య కొరవడిన సఖ్యత 


బీబీనగర్‌ (నల్లగొండ): చేపల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జడ్పీచైర్మన్‌ ఎలిమినేటి సం దీ్‌పరెడ్డి అన్నారు. మత్స్యఅభివృద్ధి పథకం ద్వారా ఆ శాఖ జిల్లావాప్తంగా చేపపిల్లల పంపిణీ కర్యాక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా బుధవారం జడ్పీచైర్మన్‌ సందీ్‌పరెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి వేర్వేరుగా హాజరై బీబీనగర్‌ పెద్దచెరువులో చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షా లు కురుస్తుండడంతో జిల్లాలోని చెరువులు, కుంటల్లోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయని, చెరువులపై ఆధారపడి జీవించే వారి అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. వర్షాలు మొదలై చెరువుల్లోకి నీరు చేరినందున 2.25 కోట్ల చేపపిల్లల పంపిణీ చేపడుతుందని తెలిపారు. బీబీనగర్‌ చెరువులో 4.65లక్షల చేపపిల్లలను వదిలినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీపీ సుధాకర్‌గౌడ్‌, జడ్పీటీసీ ప్రణితాపింగల్‌రెడ్డి, భువనగిరి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లావణ్యాదేవేందర్‌రెడ్డి,  సర్పంచ్‌ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ దస్తగిరి, బొక్క జైపాల్‌రెడ్డి, రాచమల్ల శ్రీనివాస్‌, మహేశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 


ఎదురు పడినా ఆపని ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్‌ కార్లు 

బీబీనగర్‌: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ సందీ్‌పరెడ్డి మధ్య సఖ్యత లేదని మరోసారి రుజువైంది. బుధవారం బీబీనగర్‌లో మత్య్సశాఖ చేపట్టిన చేపపిల్లల పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమం దీనికి సాక్ష్యంగా నిలిచింది. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు బీబీనగర్‌ పెద్ద చెరువు వద్ద ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం జడ్పీచైర్మన్‌ సందీ్‌పరెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని ఆహ్వానించారు. ఉదయం 10గంటలకు కార్యక్రమాన్ని నిర్ణయించారు. కాగా, ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి సమయానికి చెరువు వద్దకు చేరుకొని చేపపిల్లలను చెరువులోకి వదిలి తిరిగి వెళ్తుండగా, మత్స్యశాఖ జిల్లా అధికారిణి షకీలాభాను జడ్పీచైర్మన్‌ కూడా వస్తున్నారు. ఐదు నిమిషాలు ఆ గాల్సిందిగా ఎమ్మెల్యేను కోరింది. అయినా ఎమ్మె ల్యే కారు ఎక్కి వెళ్లిపోతుండగా జడ్పీచైర్మన్‌ కారు ఎదురు పడింది. ఎవరు కారు ఆపకుండా ఎవరి దారిన వారు వెళ్లిపోవడంతో అక్కడున్నవారం తా ఆశ్చర్యానికి గురయ్యారు. 10నిమిషాలు ఆలస్యంగా వచ్చిన జడ్పీచైర్మన్‌ సందీ్‌పరెడ్డి అధికారులతో కలిసి మరోసారి చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకముందు ఎమ్మెల్యేతో పాటు కారులో వెళ్లి పోతున్న స్థానిక సర్పంచ్‌ మల్లగారి భాగ్యలక్ష్మీని మత్స్యశాఖ అధికారి షకీలాభాను సర్పంచ్‌ బుజంపై చేయి వేసి జడ్పీచైర్మన్‌ వద్దకు రావాలని వేడుకుంటూ తీసుకెళ్లడం కొసమెరుపు. ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సంయుక్తంగా హాజరై ప్రారంభించాల్సిన ప్రజా ప్రతినిధులు వర్గ విభేదాలతో ఎవరికి వారు వేర్వేరుగా కార్యక్రమానికి హాజరు కావడంపై అధికారులు, ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది.


Updated Date - 2020-08-13T18:02:14+05:30 IST