మమతతో గొంతు కలిపిన వామపక్షాలు

ABN , First Publish Date - 2021-06-18T00:22:47+05:30 IST

ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అనూహ్యంగా వామపక్షాల మద్దతు దొరికింది. అయితే ఈ మద్దతు గవర్నర్ ధన్కర్

మమతతో గొంతు కలిపిన వామపక్షాలు

కోల్‌కతా : ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అనూహ్యంగా వామపక్షాల మద్దతు దొరికింది. అయితే ఈ మద్దతు గవర్నర్ ధన్కర్ విషయంలో. మొదటి నుంచి కూడా అధికార తృణమూల్ గవర్నర్ ధన్కర్ తీరుపై నిప్పులు గక్కుతూనే ఉంది. సమయం చిక్కినప్పుడల్లా ఆయనపై విరుచుకుపడుతూనే ఉంది. గవర్నర్‌లా కాకుండా, బీజేపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని మండిపడిన సందర్భాలున్నాయి. అధికార తృణమూల్ విమర్శలు చేసే సమయంలో కాంగ్రెస్, వామపక్షాలు ఏమీ మాట్లాడలేదు. అయితే తాజాగా ఈ విషయంలో అధికార తృణమూల్‌కు లెఫ్ట్ మద్దతుపలకడం విశేషం. గవర్నర్ ధన్కర్ బీజేపీ ఏజెంట్‌గా మాట్లాడుతున్నారని, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ బిమన్ బోస్ ఆక్షేపించారు. ఆయన వ్యవహార శైలిని తాము ఖండిస్తున్నామని ప్రకటించారు. ‘‘ఆయన ప్రస్తుతం బీజేపీ మనిషి కాదు. కానీ ఆయన వ్యవహార శైలి బీజేపీ మనిషిని తలపిస్తోంది. గవర్నర్‌లా వ్యవహరించడం లేదు. కేవలం బీజేపీ వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నారు. ఇది ఏమాత్రం సరికాదు. ఓ గవర్నర్ పదవిలో ఉంటూ ఇలా వ్యవహరించడం ఏమాత్రం భావ్యం కాదు.’’ అని బిమన్ బోస్ మండిపడ్డారు. 

Updated Date - 2021-06-18T00:22:47+05:30 IST