Abn logo
Jun 12 2021 @ 20:28PM

ఇంటి ముందు నిద్రిస్తున్న కుక్కను సైలెంట్‌గా ఎత్తుకెళ్లిన చిరుత

మహారాష్ట్ర: చిరుత పులి వేటే సపరేటు. తనకు కావాల్సిన దాన్ని పట్టుకుని చీల్చి చెండాడే వరకు పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తుంది. కొన్నికొన్ని సార్లు ఎలాంటి హడావుడి, చడీచప్పుడు కాకుండా తన వేటను సైలెంట్‌గా ముగిస్తుంది. అలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది.


నాశిక్‌లోని ఉసే గ్రామంలో ఓ ఇంటి బయట కుక్క పిల్ల రాత్రి సమయంలో హాయిగా నిద్రపోతోంది. కుక్క పిల్లను గమనించిన చిరుత పులి నెమ్మదిగా, చడీచప్పుడు లేకుండా అడుగులో అడుగు వేసుకుంటూ దాని దగ్గరకు వెళ్లింది. కుక్కపిల్లను నోటితో పట్టుకుని తన వెంట తీసుకెళ్లింది. చిరుత పులి కుక్కపిల్లను ఎత్తుకెళ్లే దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. 


ప్రత్యేకంమరిన్ని...