చి‘వరికి’ దళారీ దిక్కు

ABN , First Publish Date - 2021-12-01T04:59:55+05:30 IST

వరుస తుఫాన్‌లతో వరి రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

చి‘వరికి’ దళారీ దిక్కు
బర్రింకలపాడు వద్ద రహదారిపై సంచుల్లో పట్టిన ధాన్యం

రైతును భయపెడుతున్న వాతావరణం, తేమశాతం

ప్రభుత్వ కొనుగోళ్ల ఊసే లేదు


వరుస తుఫాన్‌లతో వరి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి తుఫాన్‌ రైతు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు ఇప్పటికే మాసూలైన ధాన్యం కొనేవారు లేరు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కేంద్రాల్లో కొనుగోలు ఊసే లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులకు దళారులే దిక్కయ్యారు. మబ్బులు, వర్షాలతో రైతులు హడావుడిగా మాసూళ్లు చేసి దళారులకు విక్రయిస్తున్నారు. గిట్టుబాటు ధర అందక నష్టాలు మూటకట్టుకుంటున్నారు.


జీలుగుమిల్లి/నల్లజర్ల, నవంబరు 30: మబ్బులు, వర్షాల కారణంగా రైతులు కోత యంత్రాలతో ధాన్యం మాసూ లు చేసి దళారులకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆర్‌బీకే, సొసైటీ, డీసీఎంఎస్‌ల ద్వారా ధాన్యం కొనుగోలు ఊసే ఎత్తడం లేదు. ఆయా కేంద్రాల్లో తేమశాతం 17లోపు ఉంటేనే ధాన్యం కొనుగోలుకు అనుమతి ఇవ్వ డంతో తప్పనిసరి పరిస్థితిలో దళారులకు విక్రయిస్తున్నామని రైతులు వా పోతున్నారు. బస్తా 75 కిలోలు పీఎల్‌ ఎ రకం రూ.వెయ్యి, 1064 రకం రూ. 960 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది రైతులు ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం పంట అమ్మకం పోను వట్టి గడ్డి మాత్రమే మిగులుతుందని వరి రైతులు వాపోతున్నారు. నిల్వ ఉంచేందుకు వీలు లేకుండా తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పూర్తిగా నష్టపో కుండా రైతులు ముందే దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదనుగా  దళారులు ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల వల్ల వర్షం వస్తే పూర్తిగా నష్టపోతామని రైతులు ఆందోళనలో ముందుగానే అమ్ముకునే ప్రయత్నంలో ఉన్నారు.


గిట్టుబాటు ధర లేదు


ధాన్యానికి గిట్టుబాటు ధర అందక రైతులు విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ధాన్యం కొనుగొలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికి క్షేత్రస్థాయిలో ఆరుదల, టోకెన్‌ వంటి ఇబ్బందులు ఉండడంతో దళారులకే ధాన్యం విక్రయిస్తున్నారు. 75 కేజీల బస్తా రూ.వెయ్యి నుంచి రూ.1100 వరకు ఉం డడంతో రైతులకు గిట్టుబాటు కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతులకు మరింత నష్టం వచ్చింది. పంట వేసిన వెంటనే మద్దతు ధర ప్రకటిస్తాం, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చేప్పే ప్రభుత్వం కార్యాచర ణలో విఫలం కావడంతో ఇబ్బందులు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు వరి చేలు నేలనంటడంతో ఒక వైపు నష్టం వస్తే మరోక వైపు అంతంత మాత్రం మిగిలిన పంటకు ధర లేక రైతు పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాడు.

Updated Date - 2021-12-01T04:59:55+05:30 IST